సభలో చంద్రబాబు ప్రవర్తనను ఖండిస్తూ తీర్మానం

Resolution On Chandrababu Conduct In AP Assembly - Sakshi

తీర్మానం ప్రవేశపెట్టిన బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి

సభలో దురదృష్టకరమైన పరిణామం: స్పీకర్‌

సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రవర్తనను ఖండిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. చంద్రబాబు వ్యవహారశైలిపై రూల్ 77 ప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రి బుగ్గన  రాజేంద్రనాథ్‌‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని పరిశీలనలోకి తీసుకుంటున్నామని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని, సభలో దురదృష్టకరమైన పరిణామం నేనెప్పుడూ చూడలేదని స్పీకర్‌ పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారని, రాజ్యాంగ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని స్పీకర్‌ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. (చదవండి: చంద్రబాబు యాక్టర్‌ అయితే..: సీఎం జగన్‌)
(చదవండి: అసెంబ్లీలో చంద్రబాబు డ్రామా.. సస్పెన్షన్)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top