నేడు అంగప్రదక్షిణం టోకెన్ల కోటా విడుదల

తిరుమల/తిరుపతి అలిపిరి: తిరుమలలో మార్చి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాతో పాటు ఈనెల 23 నుంచి 28వ తేదీ వరకు విడుదల చేయని కోటాను ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి ఆన్‌లైన్‌లో టోకెన్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
అలాగే తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు రూ.300 ఎస్‌ఈడీ టికెట్ల ఆన్‌లైన్ కోటాను ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం అర్ధరాత్రి వరకు 59,090 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 22,593 మంది తలనీలాలు సమర్పించారు. రూ.4.03 కోట్ల కానుకలు వేశారు. దర్శన టికెట్లు లేని భక్తులకు 14 గంటల్లో స్వామివారి దర్శనం లభిస్తోంది.
మరిన్ని వార్తలు :