ఎల్లో మీడియా దుష్ప్రచారంపై రజత్‌ భార్గవ్‌ స్పష్టత

Rajat Bhargava Gave Clarity On Yellow Media Misinformation - Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వం ఎల్‌పీజీ గ్యాస్‌ ధర పెంచిందంటూ ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'గృహావసరాలకు వాడే గ్యాస్ ధర ప్రభుత్వం పెంచలేదు. ఎల్‌పీజీ గ్యాస్‌పై వ్యాట్ పెంచామన్నది అబద్ధం. అసలు ఎల్‌పీజీ గ్యాస్‌పై ట్యాక్స్ జీఎస్టీ పరిధిలోనిది. ఎల్‌పీజీపై రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ పెంచే అవకాశమే లేదు.

కొన్ని మీడియా సంస్థలు అవగాహన లేక తప్పుగా ప్రచారం చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం నేచురల్ గ్యాస్‌పై ట్యాక్స్‌ను స్వల్పంగా పెంచింది. అది పరిశ్రమలకు, విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే గ్యాస్ మాత్రమే. వంట గ్యాస్‌పై ట్యాక్స్ ఎక్కడా పెంచలేదు' అని రజత్‌ భార్గవ్‌ స్పష్టం చేశారు.  ('చంద్రబాబులా ఈ ప్రభుత్వం సీబీఐకి భయపడదు')

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top