కరోనా వ్యాక్సిన్‌లో ‘తెలుగోడి సాఫ్ట్‌వేర్‌’ 

PrimeSoft software company providing software for Corona vaccine clinical trials - Sakshi

సాక్షి, కాకినాడ: కాకినాడకు చెందిన ప్రైమ్‌సాఫ్ట్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ అమెరికాలోని న్యూయార్క్‌లో నిర్వహిస్తోన్న కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌లో కీలకపాత్ర పోషిస్తోంది. ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగుతున్న ఈ ట్రయల్స్‌కు అవసరమైన ‘సబ్జెక్ట్‌ డేటా’ను అందిస్తోంది. దిగ్గజ ఔషధ తయారీ సంస్థలన్నీ తమ ఉత్పత్తులకు ప్రామాణికంగా తీసుకునే రోచెస్టర్‌ క్లినికల్‌ రీసెర్చ్‌ సంస్థకు.. మన రాష్ట్రానికి చెందిన ఈ కంపెనీ సేవలందిస్తోంది. ప్రైమ్‌సాఫ్ట్‌ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌తో ఇప్పటికే 750 మందికి ట్రయల్స్‌ నిర్వహించారు. 

► అమెరికా ప్రభుత్వ పర్యవేక్షణలో గత ఏడాది సాధారణ పరిశీలన కోసం కాకినాడకు వచ్చిన ఆ సంస్థ ప్రతినిధులు.. సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్కు(ఎస్‌టీపీ)లో కొలువుదీరిన ప్రైమ్‌సాఫ్ట్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.  
► కాకినాడ సంస్థ ఆవిష్కరించిన అధునాతన సాఫ్ట్‌వేర్‌లను చూసి అప్పట్లోనే మంత్రముగ్ధులయ్యారు. ఇటీవల కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌లో వినియోగించే ’సబ్జెక్ట్‌ డేటా’ సాఫ్ట్‌వేర్‌ రూపొందించాలని కోరారు.  
► అప్పటికే ఇదే ప్లాట్‌ఫాంపై పని చేస్తున్న ప్రైమ్‌సాఫ్ట్‌ స్థానిక సిబ్బంది.. రోజుల వ్యవధిలోనే సీసీ ఈసోర్స్‌ పేరుతో క్లినికల్‌ ట్రయల్స్‌ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి అమెరికన్‌ సంస్థకు అందజేశారు. క్లినికల్‌ ట్రయల్స్‌ జరిగే అన్ని అంచెల్లోనూ సీసీ ఈ–సోర్స్‌ తన సేవలను అందిస్తోంది.  
► సంస్థ కృషికి గోదావరి వాసిగా గర్విస్తున్నానని ఆంధ్రప్రదేశ్‌ ఐటీ అసోసియేషన్‌ గోదావరి రీజియన్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి కొవ్వూరి అన్నారు.  
► ప్రైమ్‌సాఫ్ట్‌ సీఈఓ ఆళ్ల నాగరాజు మాట్లాడుతూ.. ప్రభుత్వం పిలుపు మేరకు స్థానిక యువతకు ప్రాధాన్యమిచ్చామని, తద్వారా అద్భుతమైన ప్రయోజనాలు రాబట్టామని చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top