
సాక్షి, కాకినాడ జిల్లా: సామర్లకోట బ్రౌన్ పేటలో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. రోడ్డు మీద బాణాసంచా కాలుస్తున్న యువకులను పోలీసులు చెదరగొట్టారు. బాణాసంచా కాల్పులను చూసేందుకు వచ్చిన అక్షయ్ కుమార్ గాయపడ్డాడు.
ఆ యువకుడిని సామర్లకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ సతీష్ కుమార్.. అక్షయ్ కుమార్ మెడపై లాఠీతో కొట్టారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆసుపత్రి వద్ద దళిత సంఘాలు అందోళన చేపట్టాయి. పోలీసు వాహనాన్ని బాధితుడి బంధువులు అడ్డుకున్నారు.