మకర సంక్రాంతి వేళ పల్లెలతో పాటు పట్టణాలు కూడా సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ముచ్చటగా మూన్నాళ్లు చేసే పండుగకు బసవయ్యలతో గంగిరెద్దోళ్లు కూడా సిద్ధమయ్యారు. పీ..పీ ఊదుతూ గంగిరెద్దును పట్టుకొని ఇంటింటికీ వెళ్లి ఇచ్చింది తీసుకెళ్తుంటారు. హైటెక్ యుగంలోనూ బసవయ్యలను దైవంగా భావిస్తూ తమ కులవృత్తిని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు .
         
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం   

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
