Photo Feature: ప్రకృతి గీసిన చిత్రం  | Photo Feature: Image Of Nature Vizag Beach | Sakshi
Sakshi News home page

Photo Feature: ప్రకృతి గీసిన చిత్రం 

Jun 20 2022 4:06 PM | Updated on Jun 20 2022 4:14 PM

Photo Feature: Image Of Nature Vizag Beach - Sakshi

ప్రకృతి.. మనల్ని ఎన్ని రకాల సొబగులతో మురిపిస్తుందో కదా! కొండలు.. గుట్టలు.. లోయలు.. సముద్రం.. నదులు.. చెట్లు.. కొమ్మలు.. ఆకులు.. పూలు.. అసలు అందలేనిదేది?

ప్రకృతి.. మనల్ని ఎన్ని రకాల సొబగులతో మురిపిస్తుందో కదా! కొండలు.. గుట్టలు.. లోయలు.. సముద్రం.. నదులు.. చెట్లు.. కొమ్మలు.. ఆకులు.. పూలు.. అసలు అందలేనిదేది? ఆకట్టుకోనిదేది? కవుల వర్ణనలో కనిపించే అందాలకు నెలవు మన విశాఖ.
చదవండి: వీటిని ఎక్కువ కాలం వాడుతున్నారా.. అయితే డేంజర్‌లో పడ్డట్టే!

ఇది పర్యాటకుల స్వర్గధామం. ఆహ్లాదపరిచే పర్యావరణం.. పచ్చని  అందాలతో అలరారే జీవ వైవిధ్యం.. సహజ అందాల సాగరతీరం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో అందాలు.. మరెన్నో అనుభూతులు.. అలాంటి దృశ్యమే ఇది.  ఆకుపచ్చగా గడ్డి.. మబ్బులు కమ్మిన ఆకాశం.. అల్లంతదూరంలో సముద్రం.. నిర్మాణంలో ఉన్న పడవ.. ఆహా ఏం అందం.! ప్రకృతి గీసిన ఈ చిత్రం.. కోస్టల్‌ బ్యాటరీ వద్ద ఆదివారం సాయం సంధ్య వేళలో ఆవిష్కృతమైంది.
-ఫొటో:  సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement