పెన్నా నది పరవళ్లు.. సువర్ణముఖి చిందులు

Penna, Swarnamukhi River Overflows: Water Release From Perur Dam - Sakshi

మూడు దశాబ్దాల తర్వాత రెండోసారి ఎత్తిన ‘పేరూరు’ గేట్లు

సాక్షి, రామగిరి(శ్రీ సత్యసాయి జిల్లా): ఎగువ ప్రాంతం కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు పెన్నమ్మ పరవళ్లు తొక్కుతూ పేరూరు చేరింది. దీంతో డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుండటంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఇప్పటి వరకూ ఒకటిన్నర టీఎంసీ దిగువకు వదిలినా పేరూరు డ్యాంకు ఇన్‌ఫ్లో ఏమాత్రం తగ్గలేదని, అందుకే నీటిని ఏకధాటిగా వదలుతున్నట్లు డీఈ వెంకటరమణ తెలిపారు. 


భారీ వర్షాలతో మూడు దశాబ్దాల తర్వాత పేరూరు డ్యాం నిండుకుండను తలపించగా... గత నెలలో తొలిసారి పేరూరు డ్యాం గేట్లు ఎత్తారు. తాజాగా సోమవారం మరోసారి గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతుండగా.. ఈ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు పలు గ్రామాల ప్రజలు డ్యాం వద్దకు వస్తున్నారు. 


సువర్ణముఖి చిందులు 

నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి మరువ పారిన చెరువులు 

అగళి: 20 రోజులుగా కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షానికి సువర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు అగళి మండలంలోని మధూడి, ఇరిగేపల్లి, కోడిపల్లి, రావుడి, వడగుంటనపల్లి చెరువుల్లో చేరడంతో నాలుగు దశాబ్దాల తర్వాత అవన్నీ మరువ పారాయి. దీంతో స్థానికులు తండోపతండాలుగా వచ్చి మరువపారుతున్న ప్రాంతాల్లో జలకాలాటలు ఆడారు. (క్లిక్‌: ప్రాణం పోసుకుంటున్న నల్ల రాతి శిలలు!)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top