నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం వద్ద పెన్నానది మధ్యలో 6 మంది పశువుల కాపర్లు చిక్కుకున్నారు. ఉదయం అప్పారావు పాలెం నుండి పశువులు మేపుకునేందుకు పెన్నా నదిలోకి వెళ్లిన పశువుల కాపర్లు. అక్కడ చిక్కుకుపోయారు.

పశువులు మేపుకోవడానికి వెళ్లి తిరిగి వస్తూ ఒకసారిగా వచ్చిన నీటి ప్రవాహంతో మధ్యలో జమ్ము సహాయంతో సహాయం కోసం ఆర్తనాదాలు చేయడంతో పోలీసులకు ఫైర్ సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. వారిని కాపాడేందుకు ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పెన్నా నదిలో చిక్కుకున్న వారిలో వెంకటరమణయ్య, శ్రీనివాసులు,కాలేషా,కవిత,చెన్నయ్య, మరో మహిళగా గుర్తించారు.


