20 నెలల తరువాత గుర్తుకొచ్చిన చిరునామా

Patient Discharge Today From Psychiatric Hospital After 20 Months - Sakshi

మానసిక ఆస్పత్రి నుంచి నేడు రోగి డిశ్చార్జి

సాక్షి, విశాఖపట్నం: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 20 నెలలు తరువాత మతిస్థిమితం లేని ఓ వ్యక్తికి ఎట్టకేలకు చిరునామా గుర్తుకొచ్చింది. దీంతో ఆయనను ప్రభుత్వ మానసిక ఆస్పత్రి నుంచి సోమవారం డిశ్చార్జి చేయాలని వైద్యులు నిర్ణయించారు. వివరాలిలా ఉన్నాయి.మధ్యప్రదేశ్‌కు చెందిన సురేంద్రకుమార్‌(22) చినవాల్తేరులో రోడ్డు పక్కన ఉండడంతో గమనించిన ప్రభుత్వ మానసిక ఆస్పత్రి డాక్టర్‌ ప్రొఫెసర్‌ రామానంద శతపతి తన సహచరుని కారులో ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు.  (వైశాలి.. ఊరెళ్లమంటే చనిపోతానంటోంది..!)

జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ సాయంతో రిసెప్షన్‌ ఆర్డర్‌ తేవడంతో పోలీసులు సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో రోగి కోలుకోవడంతో తన వివరాలు తెలియజేశాడు. ఈ మేరకు జిల్లా పోలీసులు మధ్యప్రదేశ్‌ డీజీపీని సంప్రదించడంతో కుమార్‌ డిశ్చార్జికి మార్గం సుగమమైంది. ఆస్పత్రి చిరునామా కోసం కుమార్‌ కుటుంబీకులు ఆస్పత్రి డాక్టర్‌ని ఆదివారం సంప్రదించారు. అతని కుటుంబ సభ్యులు సోమవారం మానసిక ఆస్పత్రికి వస్తారని డాక్టర్‌ రామానంద శతపతి ‘సాక్షి’కి తెలిపారు.    (పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో..)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top