దొంగల చేతికి తాళాలు ఇవ్వడం అంటే ఇదేనేమో..

Officers Who Put Money In ATM Machine Forgot To Lock It In Kurnool District - Sakshi

డోన్‌ టౌన్‌: దొంగల చేతికి తాళాలు ఇవ్వడం అంటే ఇదేనేమో.. ఏటీఎంలో డబ్బు పెట్టిన అధికారులు, ఆ తర్వాత మిషన్‌ తాళాలు కూడా అక్కడే మరచిపోయారు. ఈ సంఘటన డోన్‌లో చోటు చేసుకుంది. ఇటీవల పట్టణంలో ఎస్‌బీఐ ఏటీఎంను దొంగలు కొల్లగొట్టిన ఘటన సంచలనం సృష్టించింది. తాజాగా మరో సంఘటన చర్చనీయాంశంగా మారింది.

స్థానిక రాజ్‌ థియేటర్‌ సమీపంలోని సిండికేట్‌ బ్యాంక్‌ అధికారులు సోమవారం మధ్యాహ్నం డాక్టర్‌ పోచా ప్రభాకర్‌రెడ్డి క్లినిక్‌ ఎదురుగా ఉన్న సిండికేట్‌ ఏటీఎంలో డబ్బులు పెట్టి తాళాలు వేశారు. అయితే మిషన్‌కు సంబంధించిన తాళాలు అక్కడే మరచిపోయారు. డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తి తాళాలు గుర్తించి బ్యాంక్‌ అధికారులకు అప్పగించారు. ఒక వేళ దొంగల చేతికి తాళాలు చిక్కి ఉంటే మరో చోరీ జరిగి ఉండేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. 

ఇవీ చదవండి:
ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు 
ఎచ్చెర్ల టీడీపీ ‘కళా’విహీనం..!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top