breaking news
not locked
-
దొంగల చేతికి తాళాలు ఇవ్వడం అంటే ఇదేనేమో..
డోన్ టౌన్: దొంగల చేతికి తాళాలు ఇవ్వడం అంటే ఇదేనేమో.. ఏటీఎంలో డబ్బు పెట్టిన అధికారులు, ఆ తర్వాత మిషన్ తాళాలు కూడా అక్కడే మరచిపోయారు. ఈ సంఘటన డోన్‌లో చోటు చేసుకుంది. ఇటీవల పట్టణంలో ఎస్బీఐ ఏటీఎంను దొంగలు కొల్లగొట్టిన ఘటన సంచలనం సృష్టించింది. తాజాగా మరో సంఘటన చర్చనీయాంశంగా మారింది. స్థానిక రాజ్ థియేటర్ సమీపంలోని సిండికేట్ బ్యాంక్ అధికారులు సోమవారం మధ్యాహ్నం డాక్టర్ పోచా ప్రభాకర్‌రెడ్డి క్లినిక్ ఎదురుగా ఉన్న సిండికేట్ ఏటీఎంలో డబ్బులు పెట్టి తాళాలు వేశారు. అయితే మిషన్‌కు సంబంధించిన తాళాలు అక్కడే మరచిపోయారు. డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తి తాళాలు గుర్తించి బ్యాంక్ అధికారులకు అప్పగించారు. ఒక వేళ దొంగల చేతికి తాళాలు చిక్కి ఉంటే మరో చోరీ జరిగి ఉండేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇవీ చదవండి: ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు ఎచ్చెర్ల టీడీపీ ‘కళా’విహీనం..! -
ఏటీఎంలో డబ్బులు పెట్టి... తాళం మరిచారు
హైదరాబాద్: ఏటీఎం సెంటర్లలో లక్షలాది రూపాయలను డిపాజిట్ చేస్తున్న బ్యాంక్ అధికారులు ఏటీఎం మిషనన్లను లాక్ చేయడం మరిచిపోతున్నారు. శనివారం ఫతేదర్వాజాలోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో డబ్బులు డిపాజిట్ చేసిన బ్యాంక్ అధికారులు ఏటీఎం మిషన్‌ను లాక్ చేయకపోగా, ఏటీఎం డోర్‌కు తాళం చేవులను అలాగే వదిలి వెళ్లారు. దీనిపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కాపాలాగా ఉండి, బ్యాంకు సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి తాళం వేసి వెళ్లారు.