ఆక్సిజన్‌ కొరతకు అధికారుల చెక్‌

Officers check for oxygen deficiency in AP - Sakshi

గన్నవరం: కోవిడ్‌ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరతను అధిగమించేందుకు మంగళవారం కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్, రెవెన్యూ యంత్రాంగం చూపిన చొరవ సత్ఫలితాలనిచ్చింది. చెన్నై, పశ్చిమ బెంగాల్‌ నుంచి వచ్చిన రెండు ఆక్సిజన్‌ ట్యాంకర్లను గుర్తించి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కోవిడ్‌ ఆస్పత్రులకు 19 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేశారు. మొదట చెన్నై నుంచి తెలంగాణలోని ఖమ్మంకు వెళుతున్న క్యూమెన్‌ ఎయిర్‌ ప్రొడక్ట్‌ ఏజెన్సీకి చెందిన ట్యాంకర్‌ 23 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌తో గన్నవరం మండలం  సూరంపల్లికి వచ్చింది.

విజయవాడ సబ్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఉంగుటూరు తహసీల్దార్‌ వనజాక్షి సదరు కంపెనీ యజమానితో చర్చలు జరపడంతో 13 మెట్రిక్‌ టన్నులు ఆక్సిజన్‌ ఇవ్వడానికి అంగీకరించారు. అదేవిధంగా ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్‌ప్లాజా వద్ద పశ్చిమ బెంగాల్‌ నుంచి వస్తున్న 20 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ట్యాంకర్‌ను కూడా అధికారులు ఆపారు. సదరు సంస్థ ప్రతినిధులతో మాట్లాడి 6 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఇచేందుకు ఒప్పించారు. సీఐ కోమాకుల శివాజీ, ఎస్‌ఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top