రాష్ట్రాభివృద్ధికి ఎన్నారైల బాసట

NRIs Support To Andhra Pradesh Development - Sakshi

ప్రభుత్వానికి పూర్తి సహాయ, సహకారాలు అందిస్తాం

ప్రవాస భారతీయుల ప్రతిష్ట పునరుద్ధరణకు కృషి

సోషల్‌ మీడియాకు తోడ్పాటునివ్వాలి

సీఎం వైఎస్‌ జగన్‌ రెండేళ్ల పాలనపై వెబినార్‌లో వక్తలు

గుంటూరు ఎడ్యుకేషన్‌: గత పాలకుల కబంధ హస్తాలు, కులాల కుంపట్లతో దిగజారిన ప్రవాస భారతీయుల ప్రతిష్ట పునరుద్ధరణ, ఏపీ అభివృద్ధికి స్వచ్ఛంద సేవ, నిధుల సేకరణలో ప్రధాన భూమిక పోషించి రాష్ట్రాభివృద్ధిలో సీఎం వైఎస్‌ జగన్‌కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వాషింగ్టన్‌ డీసీకి చెందిన ఎన్నారై వల్లూరి రమేష్‌రెడ్డి తెలిపారు. గుంటూరు అమరావతి రోడ్డులోని అవర్‌ స్టేట్‌ అవర్‌ లీడర్, వైఎస్సార్‌ ఇంటెలెక్చు్యవల్‌ ఫో రం సంయుక్త ఆధ్వర్యంలో ‘సుపరిపాలన ప్రస్థానంలో రెండేళ్లు–సవాళ్లు–సాఫల్యాలు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నాయకత్వం లో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్ర’ అంశంపై ఎన్నారైలతో సోమవారం  ఫోరం అధ్యక్షుడు జి.శాంతమూర్తి అధ్యక్షతన సమావేశం జరిగింది. అమెరికా నుంచి వల్లూరి రమేష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏపీఅభివృద్ధిలో స్వచ్ఛంద భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. వ్యాపార భాగస్వామ్యాలతో ఎన్నారైలు రాష్ట్రాభివృద్ధికి, తద్వారా దేశాభివృద్ధికి తోడ్పడాలని ఫ్రాన్స్‌కు చెందిన జి.రాహుల్‌ సూచించారు.

పచ్చ మీడియా పోకడలను తిప్పికొట్టాలి
మరో ఎన్నారై బొమ్మిరెడ్డి రామిరెడ్డి మాట్లాడుతూ.. గత రెండేళ్లలో వైఎస్‌ జగన్‌ సర్కార్‌ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఎన్నారైలతో పాటు విదేశీ ప్రతినిధులు సైతం గమనిస్తున్నారని చెప్పారు. అలాగే, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై నిత్యం బురద జల్లుతున్న పచ్చ మీడియా పిచ్చిపోకడలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు సోషల్‌ మీడియా విభాగానికి ఎన్నారైల తోడ్పాటు అవసరమని రామిరెడ్డి చెప్పారు. ఏపీ ఎన్నారై రీజనల్‌ కో–ఆరి్డనేటర్‌ కూచిబొట్ల కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఏపీఎన్‌ఆర్టీ ద్వారా పెట్టుబడులను ఆకర్షించి ఉద్యోగాల కల్పనలో ఎన్నారైలు భాగస్వాములవుతారని హామీ ఇచ్చారు.

ఎన్నారైలు శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని అందించాలి
గుంటూరుకు చెందిన వెంకట్‌ ఇక్కుర్తి మాట్లాడుతూ.. కాల్‌ సెంటర్ల ద్వారా ఉద్యోగాలు, పరిశోధనలకు మౌలిక సదుపాయాల కల్పనలో ఎన్నారైలు కీలక భూమిక నిర్వర్తించాలని సూచించారు. నాలెడ్జ్, కల్చరల్‌ ఎక్సే్ఛంజ్‌ను ప్రోత్సహించడంతో పాటు వ్యవసాయ, పారిశ్రామిక, పరిశోధన రంగాల్లో కీలకమైన శాస్త్ర, సాంకేతిక జ్ఞానాన్ని అందించాలన్నారు. సమావేశంలో ఏఎన్‌యూ ప్రొఫెసర్‌ మధుబాబు, డాక్టర్‌ వైఎస్‌ థామస్‌రెడ్డి, కాపిరెడ్డి కృష్ణారెడ్డి, పెద్ద సంఖ్యలో ఎన్నారైలు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top