రెన్యూ పవర్‌కు 2023 జూన్ 20న 300 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్ట్ స్థాపనకు అనుమతిస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 15
2023లో వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే ఏబీసీ, హీరో ఫ్యూచర్స్ ఎనర్జీస్, రెన్యూ పవర్ ఒప్పందాలు
రూ.97,500 కోట్ల పెట్టుబడికి నాడే ముందుకొచ్చిన రెన్యూ పవర్
ఏబీసీ లిమిటెడ్ రూ.1,20,000 కోట్లు, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ రూ.30,000 కోట్ల పెట్టుబడులు పెట్టేలా గత ప్రభుత్వంలోనే కుదిరిన ఒప్పందాలు
ఇప్పుడు వాటినే మరోసారి.. అది కూడా తక్కువకే కుదుర్చుకుని ఒక రోజు ముందే బాబు సర్కారు హడావుడి
రూ.3.65 లక్షల కోట్ల విలువైన 35 ఒప్పందాలంటూ ప్రచార గిమ్మిక్కులు
2023లో వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే ఏబీసీ, హీరో ఫ్యూచర్స్ ఎనర్జీస్, రెన్యూ పవర్ ఒప్పందాలు
రూ.97,500 కోట్ల పెట్టుబడికి నాడే ముందుకొచ్చిన రెన్యూ పవర్
సాక్షి, అమరావతి: అన్నీ పాత ఒప్పందాలే..! అందులోనూ గతంతో పోలిస్తే పెట్టుబడుల్లో భారీ కోతలు..! పెట్టుబడుల సదస్సుకు ఒకరోజు ముందుగానే గతంలో కుదిరిన ఒప్పందాలనే మళ్లీ మళ్లీ చేసుకుంటూ చంద్రబాబు సర్కారు సరికొత్త గారడీకి శ్రీకారం చుట్టింది. విశాఖలో శుక్ర, శనివారాల్లో సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ నిర్వహిస్తుండగా.. ఒక రోజు ముందే గురువారమే పాత ఒప్పందాలే మరోసారి చేసుకుని రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తెస్తున్నట్లు చంద్రబాబు సర్కారు ప్రచారం చేసుకోవడంపై పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. 
వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన ఒప్పందంపై నాటి సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అనంతరం రెన్యూ పవర్ చైర్మన్, సీఈవో సుమంత్ సిన్హా పోస్టు
వైఎస్సార్ సీపీ హయాంలో 2023లో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కుదిరిన ఒప్పందాలనే తిరిగి చేసుకుంటూ రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులను తెచ్చినట్లు చెప్పుకునేందుకు చంద్రబాబు సర్కారు ఆపసోపాలు పడింది. పాత ఒప్పందాలనే మళ్లీ మళ్లీ కుదుర్చుకుంటూ చంద్రబాబు సర్కారు చేస్తున్న హడావుడిని చూసి పారిశ్రామికవేత్తలు విస్తుపోతున్నారు. ఈ ప్రభుత్వం తమపై ఒత్తిడి చేయడంతో కాదనలేక తిరిగి ఒప్పందాలు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ కంటే ఒక రోజు ముందుగానే రూ.3.65 లక్షల కోట్ల విలువైన 35 ఒప్పందాలు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 
మూడూ పాత ఒప్పందాలే.. గతంతో పోలిస్తే పెట్టుబడుల్లో కోతలు
⇒ 2023లో వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో రూ.2.35 లక్షల కోట్ల ఎన్టీపీసీ పెట్టుబడుల ఒప్పందం తర్వాత ఏబీసీ లిమిటెడ్‌తో రూ.1,20,000 కోట్ల ఒప్పందం అతి పెద్దదిగా నిలిచింది. ఇప్పుడు అదే సంస్థతో మళ్లీ ఒప్పందం కుదుర్చుకుని అదేదో కొత్త ఒప్పందంగా తాజాగా చంద్రబాబు సర్కారు ప్రచారం చేసుకుంది. ఏబీసీ గ్రూప్‌నకు చెందిన ఏబీసీ క్లీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎవ్రెన్), యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ రూ.1,10,250 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తాజాగా గురువారం న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (నెడ్‌క్యాప్)తో ఒప్పందం కుదుర్చుకుంది.
⇒ ఇదే తరహాలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెన్యూ పవర్ రాష్ట్రంలో రూ.97,500 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందం చేసుకుంటే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అదే ఒప్పందాన్ని రూ.82,000 కోట్లకు తగ్గిస్తూ తిరిగి ఒప్పందం చేసుకోవడం గమనార్హం. రెన్యూ పవర్ చైర్మన్, సీఈవో సుమంత్ సిన్హాతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అనంతరం ఈ ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు.
ఎంవోయూల మాయ
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ హయాంలో 3సార్లు విశాఖ వేదికగా నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్న కొన్ని కంపెనీలు ఆ తరువాత పత్తా లేకుండాపోయాయి. వాటిలో మచ్చుకు కొన్ని.. 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో హీరో ఫ్యూచర్స్‌తో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న దృశ్యం(ఫైల్)
⇒ రూ.234 కోట్లతో 300 మందికి ఉపాధి కల్పించేలా వజ్ర రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం.
⇒ రూ.300 కోట్లతో ఎకో రిసార్ట్ అండ్ వుడ్ కాటేజీ నిర్మాణానికి వాటర్ స్పోర్ట్స్ సింపిల్ సంస్థతో ఎంవోయూ
⇒ రూ.153 కోట్ల పెట్టుబడులు పెట్టేలా స్కైవాల్ట్ ్జ మెరీనా సంస్థతో ఒప్పందం
⇒ రూ.100 కోట్లతో ఎంఐసీఈ సెంటర్ ఏర్పాటుకు వైబ్ గ్రూప్స్‌తో ఎంవోయూ
⇒ రూ.2 వేల కోట్లతో గోల్డ్‌ఫిష్ అబాడ్ సంస్థతో గోల్ఫ్ కోర్స్ నిర్మాణ ఒప్పందం.
⇒ రూ.7 వేల కోట్లతో మైత్రా మొబిలిటీ సంస్థ ఎల్రక్టానిక్ వాహనాల తయారీ యూనిట్ ఏర్పాటు ఒప్పందం.
⇒ రూ.550 కోట్లతో మాగ్నమ్ పైరెక్స్ సంస్థతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఒప్పందం.
హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ సీఎండీ రాహుల్ ముంజాల్‌తో తాజాగా మళ్లీ విశాఖపట్నంలో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న సీఎం చంద్రబాబు
⇒ వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.30,000 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందం చేసుకున్న హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఇప్పుడు ఆ పెట్టుబడిని ఏకంగా రూ.15,000 కోట్లకు తగ్గిస్తూ చంద్రబాబు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం గమనార్హం.


