పశ్చిమ గోదావరి: ఎనర్జీ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌   | Notification For Energy Assistant Posts In West Godavari | Sakshi
Sakshi News home page

పశ్చిమ గోదావరి: ఎనర్జీ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌  

Aug 31 2021 1:02 PM | Updated on Aug 31 2021 1:07 PM

Notification For Energy Assistant Posts In West Godavari - Sakshi

తూర్పుప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ తరఫున గ్రామ/ వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు ఎనర్జీ అసిస్టెంట్‌ (జూనియర్‌ లైన్‌మెన్‌ గ్రేడ్‌–2) పోస్టుల భర్తీ కోసం ఆ సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.సంతోషరావు నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): తూర్పుప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ తరఫున గ్రామ/ వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు ఎనర్జీ అసిస్టెంట్‌ (జూనియర్‌ లైన్‌మెన్‌ గ్రేడ్‌–2) పోస్టుల భర్తీ కోసం ఆ సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.సంతోషరావు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. డిస్కం పరిధిలో 398 పోస్టులను భర్తీ చేయనుండగా, వాటిలో ఏలూరు ఆపరేషన సర్కిల్‌ పరిధిలో 43 పోస్టులు ఉన్నాయి. వీటిలో 13 బ్యాక్‌లాగ్, 30 జనరల్‌ పోస్టులు. రెండేళ్ల కాలపరిమితికి ఎంపిక చేసే అభ్యర్థులకు నెలకు రూ.15 వేలు వేతనంగా చెల్లించనున్నారు.

అభ్యర్థులు పదోతరగతితో పాటు ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌ / వైర్‌మెన్‌ ట్రేడ్‌తో ఐటీఐ లేదా రెండేళ్ల ఒకేషనల్‌ ఇంటర్మీడియట్‌లో ఎలక్ట్రికల్‌ డొమెస్టిక్‌ అప్లయన్సెస్‌ అండ్‌ రివైండింగ్‌ కోర్సును పూర్తి చేసి ఉండాలన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 24లోపు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలని, అదే నెల 26 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల వివరాల్లో తేడాలను సరిచేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. అక్టోబర్‌ రెండో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు రాత పరీక్షకు సంబంధించి హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుందని, అక్టోబర్‌ 10న ఎంపిక చేసిన కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి 12.45 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.

ఇవీ చదవండి:
భర్తతో విడిపోయి, మరొకరితో సహజీవనం.. బాలికపై అత్యాచారం 
మహిళా పూజారి దారుణ హత్య. 38 రోజుల్లో నాలుగు హత్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement