‘మత్తు’ మాటలవి! | New distilleries were not allowed in our government says ys jagan | Sakshi
Sakshi News home page

‘మత్తు’ మాటలవి!

Jul 27 2024 6:07 AM | Updated on Jul 27 2024 7:01 AM

New distilleries were not allowed in our government says ys jagan

మద్యం అమ్మకాల పరిమాణం తగ్గి.. ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే కుంభకోణమా? 

బాగా మందు తాగిన వ్యక్తి కూడా నీలా అబద్ధాలు ఆడడు

ప్రస్తుతం చలామణిలో ఉన్న బ్రాండ్‌లకు అనుమతులు ఇచ్చింది బాబే

రాష్ట్రంలో 20 డిస్టిలరీలుంటే అందులో 14కు 2014–19 మధ్య అనుమతులు

మిగిలినవి అంతకు ముందు ప్రభుత్వంలో ఏర్పాటు

మా ప్రభుత్వంలో కొత్తగా డిస్టిలరీలకు అనుమతివ్వలేదు

ఉక్కుపాదం మోపడం ద్వారా మద్యపానాన్ని నియంత్రిస్తూ, మద్యం అమ్మకాల పరిమాణాన్ని తగ్గించాం. ఇదే సమయంలో ధరలు పెంచడం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచితే అదెలా కుంభకోణం అవుతుంది? కనీస పరిజ్ఞానం లేకుండా చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే బాగా మందు తాగిన వ్యక్తి కూడా చంద్రబాబులా అబద్ధాలు చెప్పరని అర్థమవుతోంది. – వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడే 14 డిస్టిలరీలకు అనుమతులిచ్చారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు, మేం అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ డిస్టిలరీల నుంచే మద్యం సరఫరా అవుతోంది. అయితే మా హయాంలో విషం అయిన మద్యం.. చంద్రబాబు హయాంలో అమృతం అవుతుందా?’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శ్వేతపత్రం పేరుతో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు. 

2014–19 మధ్య లిక్కర్‌ అమ్మకాల్లో ఏటా 15 శాతం వృద్ధి నమోదైందన్నారు. ఈ లెక్కన 2018–19 నాటికి 3.84 కోట్ల కేసుల మద్యం విక్రయించారని చెప్పారు. దీన్ని బట్టి పరిశీలిస్తే 2023–24 నాటికి లిక్కర్‌ విక్రయాలు గణనీయంగా పెరగాల్సి ఉండగా 3.2 కోట్ల కేసుల లిక్కర్‌ అమ్మకాలు తగ్గాయన్నారు. 2018–19లో 2.77 కోట్ల కేసుల బీర్లు అమ్ముడు పోతే, తమ ప్రభుత్వంలో 2023–24లో 1.12 కోట్ల కేసులు మాత్రమే విక్రయించామని చెప్పారు. దీన్ని బట్టి కమీషన్లు, లంచాల కోసం అధిక పరిమాణంలో మద్యం విక్రయాలను ఎవరు పెంచారో ప్రజలు గమనించాలని విజ్ఙప్తి చేశారు. 

మద్య నియంత్రణ చర్యల్లో భాగంగా షాక్‌ కొట్టేలా ధరలను పెంచడంతో విక్రయాలు తగ్గినప్పటికీ ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందని స్పష్టం చేశారు. నాణ్యత లేని మద్యం సరఫరా చేసి, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీశామని తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో చలామణిలో ఉన్న బ్రాండ్‌లన్నింటికీ 2014–19 మధ్య బాబు పాలనలోనే అనుమతులిచ్చారని మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

గవర్నర్‌ రిజర్వ్, లెఫైర్‌ నెపోలియన్, ఓక్టోన్‌ బారెల్‌ ఏజ్డ్, సెవెన్త్‌ హెవెన్‌ బ్లూ వంటి దాదాపు 15 బ్రాండ్ల విస్కీ, బ్రాందీ బ్రాండ్‌లకు 2018 అక్టోబర్‌ 26న చంద్రబాబు ప్రభుత్వంలో అనుమతి ఇచ్చారు. ప్రెసిడెంట్‌ మెడల్, హైదరాబాద్‌ బ్లూ డీలక్స్‌ విస్కీకి 2017 నవంబరు 22న అనుమ­తిచ్చారు. హైవోల్టేజ్, వోల్టేజ్‌ గోల్డ్, ఎస్‌ఎన్‌జీ 10000, బ్రిటీష్‌ ఎంపైర్‌ సూపర్‌ స్ట్రాంగ్‌ ప్రీమియం బీర్, బ్రిటీష్‌ ఎంపైర్‌ అల్ట్రా బ్రాండ్ల బీర్లు సైతం చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకమే. వాటన్నింటికీ 2017 జూన్‌ 7న అనుమతి జారీ చేశారు. 

రాయల్‌ ప్యాలెస్, న్యూకింగ్, సైన్‌ అవుట్‌ బ్రాండ్ల విస్కీ, బ్రాందీకి కూడా 2018 నవంబరు 9న, బిరా 91 పేరుతో మూడు రకాల బీర్‌ బ్రాండ్లకు కూడా అపద్ధర్మ సీఎంగా చంద్రబాబు 2019 మే 14న అనుమతి ఇచ్చారు. మరో అడుగు ముందుకేసి ఆ మర్నాడే 2019 మే 15న టీఐ మ్యాన్షన్‌ హౌస్, టీఐ కొరియర్‌ నెపోలియన్‌.. బ్రాండ్ల విస్కీ, బ్రాందీకి కూడా క్లియరెన్స్‌ ఇచ్చారు. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉంటే. వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు హయాంలోనే అనుమతినిచ్చారు. మిగి­లిన 6 డిస్టిలరీలకు అంతకు ముందున్న ప్రభు­త్వా­లు అనుమతి ఇచ్చాయి. 

మా ప్రభుత్వ హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. అందుకే టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన డిస్టిలరీలు తయారు చేసిన మద్యమే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కూడా సరఫరా అయ్యింది. ఈ లెక్కన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొత్తగా చేసిన అక్రమం ఏముంది? దీనికి చంద్రబాబు సమాధానం చెప్పగలరా? 2014–19 మధ్య టీడీపీ హయాంలో బడి, గుడి అన్న తేడా లేకుండా మద్యం సిండికేట్‌లు.. పర్మిట్‌ రూమ్‌లు, బెల్ట్‌ దుకాణాలతో మద్యం 24 గంటలూ ఏరులై పారించారు. 4,380 మద్యం దుకాణాలకు అనుమతించి, 43 వేలకు పైగా బెల్ట్‌షాపుల్లో అమ్మకాలు చేపట్టారు. వాటిలో మద్యం గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) కంటే 25 శాతం అధిక ధరకు విక్రయించారు.  

మాకు, వాళ్లకు మధ్య ఇదీ తేడా..
»  దశలవారీ మద్య నియంత్రణను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేసింది.  
»  టీడీపీ ప్రభుత్వ హయాంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా, వాటిని 2,934కు తగ్గించాం.
»  2019కి ముందు ప్రతి వైన్‌ షాప్‌కు అనుబంధంగా ఉన్న 4,380 పర్మిట్‌ రూమ్‌లు రద్దు చేశాం. ఊరూరా విచ్చలవిడిగా కొనసాగిన 43 వేల బెల్ట్‌షాప్‌లకు స్వస్తి పలికాం. కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు. 
»  ప్రైవేటు మద్యం దుకాణ విధానాన్ని రద్దు చేసి.. 2019 అక్టోబరు 1 నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగించాం.
» మద్యం విక్రయ వేళలు కుదించాం. ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకే మద్యం విక్రయాలు అనుమతించాం.
»  ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడుతూ, మద్యం వినియోగాన్ని నిరుత్సాహ పర్చేందుకు షాక్‌ కొట్టేలా ధరలు పెంచాం.
»  అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) ఏర్పాటు చేశాం.
»  తద్వారా గత టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే మా ప్రభుత్వంలో మద్యం విక్రయాలు దాదాపు సగానికి తగ్గాయి.  
»  మద్యం షాపుల్లో డిజిటల్‌ పేమెంట్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది మా ప్రభుత్వమే. అయినా మాపై పదే పదే దుష్ప్రచారం చేస్తున్నారు.

నాణ్యతలేని ఆరోపణలు 
నాణ్యత లేని మద్యం సరఫరాతో, వినియో­గదార్ల ఆరోగ్యం దెబ్బతిందంటూ నాణ్యత లేని ఆరోపణలు, దుష్ప్రచారం చేశారు. నాటి మద్యంలో విషపు అవశేషాలు ఉన్న­ట్లు చెన్నైలోని ఎస్‌జీఎస్‌ ల్యాబొరేటరీ పే­రిట ఓ తప్పుడు నివేదికను టీడీపీ ప్రచారంలోకి తెచ్చింది. 

అలాంటి రిపోర్ట్‌ మేం ఇవ్వ­లేదని ఆ సంస్థనే చెప్పింది. తమ నివేదికను తప్పుగా అన్వయించారని పేర్కొంది. అయి­నప్పటికీ రాష్ట్ర బెవరేజస్‌ కార్పొరేషన్‌ మద్యం నమూనాలను హైదరాబాద్‌లోని కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌)కు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టి­ట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) ల్యాబ్‌లో పరీక్షించాం. ఆ శాంపిల్స్‌ అన్నీ నిర్దేశిత ప్రమాణాల ప్రకారమే ఉన్నాయని ఐఐసీటీ కూడా నివేదిక ఇచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement