సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి

New DGP Rajendranath Reddy meets CM YS Jagan at Tadepalli - Sakshi

సాక్షి, అమరావతి: నూతన డీజీపీగా నియమితులైన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌ రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ డీజీగా ఉన్న రాజేంద్రనాథ్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో సీఎంతో ఆయన సమావేశమయ్యారు.  

1992 బ్యాచ్‌కు చెందిన రాజేంద్రనాథ్‌రెడ్డి.. 1994లో ఉమ్మడి ఏపీలో నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ అదనపు ఎస్పీగా పోస్టింగ్‌లో చేరారు. నిజామాబాద్‌ జిల్లాలో పలు బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం ఆయన విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలతో పాటు సీఐడీ, రైల్వే ఎస్పీగా పనిచేశారు. విజయవాడ, విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్‌ వెస్ట్‌ జోన్, మెరైన్‌ పోలీస్‌ విభాగంలో ఉత్తర కోస్తా ఐజీగా పనిచేశారు. పలు కీలక కేసులను ఛేదించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.

చదవండి: (చిరంజీవికి సీఎం అత్యంత గౌరవమిచ్చారు.. అదంతా తప్పుడు ప్రచారం: అలీ)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top