‘చలో వెలుగోడు’లో ఉద్రిక్తత.. వైఎస్సార్‌సీపీ నేతల అడ్డగింత | Tension In Nandyal, YSRCP Leaders Stopped By Police During Chalo Velugodu Reservoir Protest, Check Details Inside | Sakshi
Sakshi News home page

‘చలో వెలుగోడు’లో ఉద్రిక్తత.. వైఎస్సార్‌సీపీ నేతల అడ్డగింత

Sep 1 2026 10:31 AM | Updated on Sep 1 2026 12:02 PM

Nandyal Police Block YSRCP Leaders At Velugodu

సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లాలోని బండి ఆత్మకూరు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వెలుగోడు రిజర్వాయర్‌ నుంచి వెంటనే నీటిని విడుదల చేసి చెరువులను నింపాలంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ‘చలో వెలుగోడు రిజర్వాయర్‌’ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో వెలుగోడుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు శిల్పా చక్రపాణి, రవిలను శిల్పా రవిని పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది..

ఈ నేపథ్యంలో రైతుల కోసం నీళ్లు అడిగితే అడ్డుకుంటారా? అని పోలీసుల తీరుపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా వెలుగోడు రిజర్వాయర్లను ముట్టడిస్తామని శిల్పాచక్రపాణి రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు..  బస్టాండ్ వద్ద రైతులు నిరసన తెలుపుతున్నారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ.. వెంటనే కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వెలుగోడు నుండి నీటిని విడుదల చేసి చెరువుల నింపాలని మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవి కూటమి సర్కార్‌ను కోరారు.  సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే నీటి విడుదలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

వాళ్లకు నీళ్లు.. మాకు కన్నీళ్లా..? బాబుకు శిల్ప చక్రపాణి వార్నింగ్

ఇదీ చదవండి: టీడీపీ ఎమ్మెల్యే పుట్టాపై కేసు నమోదు

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement