సాయిధరమ్‌ తేజ్‌ త్వరగా కోలుకోవాలి: ఎంపీ విజయసాయిరెడ్డి | MP Vijayasai Reddy Tweets Sai Dharam Tej Should Recover | Sakshi
Sakshi News home page

సాయిధరమ్‌ తేజ్‌ త్వరగా కోలుకోవాలి: ఎంపీ విజయసాయిరెడ్డి

Sep 11 2021 12:40 PM | Updated on Sep 11 2021 1:30 PM

MP Vijayasai Reddy Tweets Sai Dharam Tej Should Recover - Sakshi

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిధరమ్‌తేజ్‌ త్వరగా కోలుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆకాక్షించారు.

సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువ హీరో సాయిధరమ్‌తేజ్‌ కోలుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. ‘‘యువ హీరో సాయిధరమ్ తేజ్ కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అపోలో ఆస్పత్రిలో ఆయన కోలుకుంటున్నారు. హెల్మెట్ ధరించడం సంతోషకరం. యువత బైక్‌పై వెళ్తున్నప్పుడు స్పీడ్ తగ్గించుకోవాలని’’ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయిధరమ్‌ తేజ్‌ త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు ఆకాంక్షించారు. సినీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, నటులు, నిర్మాతలు, డైరెక్టర్లు, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌.. సాయిధరమ్ తేజ్‌ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేశారు. 

సాయిధరమ్ తేజ్‌ త్వరగా కోలుకోవాలంటూ తెలంగాణ కాంగ్రెస్‌ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ట్వీట్‌ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఇవీ చదవండి:
సాయి తేజ్ యాక్సిడెంట్‌.. సీసీ టీవీ పుటేజీ వీడియో వైరల్‌ 
వెంటిలేటర్‌పైనే సాయిధరమ్‌తేజ్‌.. కొనసాగుతున్న చికిత్స 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement