ఇండియా కూటమికి ‘దీదీ’ సరైన నాయకురాలు: ఎంపీ విజయసాయిరెడ్డి | Mp Vijayasai Reddy Tweet On Mamata Banerjee India Alliance | Sakshi
Sakshi News home page

ఇండియా కూటమికి ‘దీదీ’ సరైన నాయకురాలు: ఎంపీ విజయసాయిరెడ్డి

Dec 9 2024 7:37 PM | Updated on Dec 9 2024 8:06 PM

Mp Vijayasai Reddy Tweet On Mamata Banerjee India Alliance

సాక్షి,న్యూఢిల్లీ:ఇండియా కూటమికి నాయకత్వం వహించడానికి సరైన నాయకురాలు పశ్చిమబెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీయేనని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి సోమవారం(డిసెంబర్‌ 9) ఎక్స్‌(ట్విటర్‌)లో ఒక పోస్టు చేశారు. 

‘ఇండియా  కూటమికి నాయకత్వం వహించేందుకు అవసరమైన రాజకీయ, ఎన్నికల అనుభవం ‘దీదీ’కి కావల్సినంత ఉంది. 42 లోక్‌సభ సీట్లున్న అతిపెద్ద పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికి దీదీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆమె నాయకత్వ పటిమ రుజువవుతూనే ఉంది’అని విజయసాయిరెడ్డి కొనియాడారు.

ఇదీ చదవండి: టార్గెట్‌ కాంగ్రెస్‌..మమత రాజకీయం ఫలించేనా..?

 

Advertisement
 
Advertisement
Advertisement