
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన చేస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.
సాక్షి, విశాఖపట్నం: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన చేస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జీవీఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. విశాఖలో వెయ్యి పార్కులను, 216 చెరువులను అభివృద్ధి చేస్తామన్నారు. 794 మురికివాడలను అభివృద్ధి చేసి ఇళ్ల పట్టాలు ఇస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు.
ఇవీ చదవండి:
చంద్రబాబు, లోకేష్‌లకు మతి భ్రమించింది: జూపూడి
విద్యార్థి మృతిపై లోకేశ్ తప్పుడు ప్రచారం