
ఎన్నికల సమయంలో అక్రమంగా నిధుల్ని మళ్లించడంపై..
సాక్షి, విశాఖపట్నం: ఐటీ విభాగం దెబ్బకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అవినీతి తేనెతుట్టె కదులుతోంది. 2019 ఎన్నికల్లో జరిగిన 100కోట్ల ఆర్థిక లావాదేవీలు.. వాటికి సంబంధించిన కేసులో ఆదాయపన్నుల శాఖ కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో.. గుట్టు బయటపడుతోంది.
తాజాగా.. విశాఖలోని హయగ్రీవ సంస్థలో ఐటీ శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. గత ఎన్నికల్లో ఈ సంస్థ నుంచే తెలుగుదేశం పార్టీకి 52.5 కోట్లు ఎన్నికల నిధులు మల్లినట్టు అభియోగాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా.. ఈ స్కాంలో హయగ్రీవ నిర్వహకుడు జగదీశ్వరుడి పాత్రపై బలంగా ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ హయాంలో అడ్డుగోలుగా కాంట్రాక్టులు సంపాదించి.. నిధులు సమకూర్చిన జాబితాలో హయగ్రీవ కంపెనీ కూడా ఉంది.
ఈ తరుణంలో.. ఎంవీపీ కాలనీలోని హయగ్రీవ కార్యాలయంలో ఐటీ వర్గాలు తనిఖీలు చేపట్టాయి. అలాగే హయగ్రీవ మేనేజింగ్ డైరక్టర్ జగదీశ్వరుడుతో పాటు పున్నం నారాయణ రావు, రాధరాణి చిలుకూరీ, అడిషనల్ డెరైక్టర్ నారాయణ శ్రీనివాస్ మూర్తీ, ఇంద్ర కుమార్ చితూరి , నారాయణ రావు గున్నం ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. జగదీశ్వరుడు గతకొంతకాలంగా అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: టిడ్కో ఇళ్లపై ఎందుకంత కుళ్లుబోతుతనం