లోకేష్‌ రౌడీలాగా మాట్లాడుతున్నారు: ఎమ్మెల్యే రోజా

MLA Roja Comments On Nara Lokesh In Chittoor - Sakshi

సాక్షి, చిత్తూరు: నారా లోకేష్‌ రౌడీలాగా మాట్లాడుతున్నారని నగరి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు ఏనాడూ కుప్పం అభివృద్ధిని పట్టించుకోలేదని.. కోవిడ్‌ సమయంలోను ప్రజలను గాలికొదిలేశారని మండిపడ్డారు.

కనీసం తాగునీరు సదుపాయం కూడా అందించలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చం‍ద్రబాబు.. ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని రోజా ఎద్దేవా చేశారు. కుప్పం నియోజక వర్గంలో వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుందని రోజా పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top