
పల్నాడు జిల్లా: మాచర్ల భగ్గుమనడానికి కారణం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌లే కారణమని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. శనివారం ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో పిన్నెల్లి మాట్లాడుతూ.. ప్లాన్ ప్రకారం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడికి పాల్పడిందన్నారు. ‘మాచర్ల భగ్గుమనడానికి కారణం చంద్రబాబు, లోకేష్. ఫ్యాక్షనిస్టు బ్రహ్మారెడ్డి ద్వారా బాబు కుట్రలు చేస్తున్నాడు.
కర్రలు, రాడ్లు ర్యాలీలో ఎక్కడ నుంచి వచ్చాయి. గొడవకు కారణమైన బాధ్యలపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు, లోకేష్ కలిసి ఆడుతున్న నాటకమిది. బ్రహ్మారెడ్డి ఉండే ఇంటిని టీడీపీ కార్యకర్తలే తగులబెట్టారు. ప్రజల్లో సానుభూతి కోసం చంద్రబాబు కుట్రలు. మాచర్లలో టీడీపీకి పార్టీ కార్యాలయమే లేదు’ అని అన్నారు.
చదవండి:
టీడీపీ రౌడీల స్వైర విహారం
మాచర్ల ఘటన: నిందితులను వదిలిపెట్టే ప్రసక్తేలేదు: డీజీపీ