ప్రెసిడెంట్‌ మెడల్‌ అనేది టీడీపీ బ్రాండ్‌: ఎమ్మెల్యే పార్థసారథి | MLA Kolusu Parthasarathy Slams On Chandrababu Over President Medal Brand | Sakshi
Sakshi News home page

ప్రెసిడెంట్‌ మెడల్‌ అనేది టీడీపీ బ్రాండ్‌: ఎమ్మెల్యే పార్థసారథి

Mar 23 2022 3:43 PM | Updated on Mar 23 2022 8:32 PM

MLA Kolusu Parthasarathy Slams On Chandrababu Over President Medal Brand - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యాపాన నిషేధాన్ని ఎత్తేసేందుకు చంద్రబాబు ముడుపులు తీసుకున్నారని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. మద్యం పాలసీపై స్వల‍్పకాలిక చర్చలో ఎమ్మెల్యే పార్థసారధి మాట్లాడుతూ.. మద్యపాన నిషేధాన్ని ఎత్తేసిన వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతోందని ఆనాడు చంద్రబాబు మద్యానికి తలుపులు తెరిచారని అన్నారు.

డిస్టిలరీస్‌ నుంచి రూ.వేల కోట్లు వసూలు చేశారని ఎమ్మెల్యే పార్థసారథి అ‍న్నారు. ప్రెసిడెంట్‌ మెడల్‌ అనేది టీడీపీ బ్రాండ్‌ అని ఎద్దేవా చేశారు. ప్రెసిడెంట్‌ మెడల్‌ అనేదానికి చంద్రబాబే పర్మిషన్‌ ఇచ్చారని అన్నారు. ఊరూరా మద్యాన్ని ఏరులై పారించిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement