అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఓవరాక్షన్‌ | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఓవరాక్షన్‌

Published Tue, Feb 6 2024 10:01 AM

Misbehavior of TDP Members In AP Assembly Threw Papers On The Speaker - Sakshi

సాక్షి, అమరావతి: అసెంబ్లీలో టీడీపీ సభ్యులు తమ తీరు మార్చుకోలేదు. అసెంబ్లీ బడ్జెట్‌ సంయుక్త సమావేశాల్లో భాగంగా రెండో రోజైన సోమవారంటీడీపీ సభ్యులు అనుచితంగా ప్రవర్తించారు.

అసెంబ్లీ ప్రారంభమైన కాసేపటికే స్పీకర్‌ చాంబర్‌ వైపు దూసుకెళ్లిన టీడీపీ సభ్యులు.. స్పీకర్‌పై పేపర్లు విసిరారు. రెడ్‌లైన్‌ దాటి మరీ స్పీకర్‌ చాంబర్‌లోకి వెళ్లిన టీడీపీ సభ్యులు.. దురుసుగా ప్రవర్తించారు.  నినాదాలు చేస్తూ తమ చేతిల్లో ఉన్న పేపర్లను స్పీకర్‌పై విసిరారు. టీడీపీ సభ్యుల తీరుతో సభను వాయిదా వేశారు స్పీకర్‌ తమ్మినేని. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement