మహిళా పక్షపాతి సీఎం జగన్‌: సుచరిత

Minister Mekathoti Sucharita Participating In Guntur Public Meeting - Sakshi

సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు స్తంబాల గరువులో ఎమ్మెల్యే మద్దాల గిరి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాల గిరిధర్, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి, మిర్చి యార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, నగర అధ్యక్షుడు రమేష్ గాంధీ, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి పాల్గొన్నారు. సభకు జనం భారీగా తరలివచ్చారు. (చదవండి: ‘ఆ మాటలు ప్రజలు మరిచిపోలేదు’)

ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్రలో సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రజల సమస్యలు తెలుసుకున్నారని, అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజాపాలన సాగిస్తున్నారని తెలిపారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డేనని తెలిపారు. ప్రతి పథకానికి ఒక తేదీ ఇచ్చి మరీ...  అమలు చేస్తున్నారని తెలిపారు. మహిళలకు వైఎస్‌ జగన్‌ అన్నివిధాలుగా అండగా ఉంటూ మహిళా పక్షపాతిగా నిలిచారని ఆమె పేర్కొన్నారు. (చదవండి: అరెస్టయిన 15 రోజుల తర్వాత ఆరోపణలా..!)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top