Minister Mekapati Goutham Reddy: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి మంగళవారం రాత్రి 11 గంటల తర్వాత నెల్లూరు నగరంలోని నివాసానికి చేరుకున్నారు. అమెరికా నుంచి నేరుగా ఆయన చెన్నై చేరుకుని అక్కడి నుంచి నెల్లూరుకు వచ్చారు. అప్పటికే మంత్రి మేకపాటి భౌతిక కాయాన్ని మంత్రి చాంబర్‌లో ఉంచారు. తన తండ్రి భౌతిక కాయంతో తనను ఏకాంతంగా వదిలేసి అందరూ బయటికెళ్లాలని కృష్ణార్జునరెడ్డి కోరారు. తండ్రి యదపై సున్నితంగా తన చేయితో నిమురుతూ కుమారుడు బోరున విలపించాడు. కృష్ణార్జున రెడ్డిని చూస్తూ పట్టరాని దుఃఖంతో మేకపాటి కుటుంబం గుండెలవిసేలా రోధించింది.



 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
