ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్‌ ఉభయ ప్రయోజనకరం: మంత్రి చెల్లుబోయిన

Minister Chelluboina Gopalakrishna Announced Decisions Of AP Cabinet - Sakshi

సాక్షి, సచివాలయం: ఏపీలో 6,840 కొత్త పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం తెలిపినట్టు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. అలాగే, నర్సాపురం ఫిషరీస్‌ కాలేజ్‌ అండ్‌ యూనివర్సిటీకి 140 పోస్టులకు, 476 గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజీల్లో నైట్‌ వాచ్‌మెన్‌ పోస్టులకు 10,117 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. ఇక, సీపీఎస్‌ విధానం రద్దు చేసి జీపీఎస్‌కు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. 

కాగా, మంత్రి చెల్లుబోయిన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్‌ ఉభయ ప్రయోజనకరం. హెచ్‌ఆర్‌ఏను 12 శాతం నుంచి 16శాతానికి పెంచాం. కొత్త మెడికల్‌ కాలేజీల్లో 2,118 సహా మరికొన్ని శాఖల్లో పోస్టులు, సీతానగరం పీహెచ్‌సీ అప్‌గ్రేడ్‌కు 23 పోస్టులకు కేబినెట్‌ ఆమోదం. ప్రతీ మండలంలో 2 జూనియర్‌ కాలేజీలకు ఆమోదం. 

కడప మానసిక వైద్యశాలలో 116 పోస్టులకు కేబినెట్‌ ఆమోదం. 3వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంపునకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కో-ఆపరేటివ్‌ సొసైటీల్లో సూపర్‌ న్యూమరీ పోస్టుకు ఆమోదం. చిత్తూరు డెయిరీకి 28.35 ఎకరాల భూమికి 99 ఏళ్లకు లీజుకు నిర్ణయం. విశాఖ మానసిక వైద్యశాలలో 11 పోస్టుల మంజూరు.

► ఇక, ఒడిశా మృతులకు కేబినెట్‌ సంతాపం తెలిపినట్టు వెల్లడించారు. బాధితుల కోసం 50 అంబులెన్స్‌లు పంపించినట్టు తెలిపారు. మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియాకు ఆమోదం తెలిపిందన్నారు.

► అనంతపురం, సత్యసాయి జిల్లాలో​ విండ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్టు స్పష్టం చేశారు.  

► ఈనెల 12 నుంచి విద్యాకానుక పంపిణీకి నిర్ణయం. ఈనెల 28 నుంచి అమ్మఒడి పథకం అమలుకు నిర్ణయం. నాడు-నేడు కింద పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో నైట్‌ వాచ్‌మెన్‌ పోస్టులకు ఆమోదం. జగనన్న ఆణిముత్యాలు పథకం అమలుకు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. 

► రూ. 5లక్షల లోపు ఆదాయం ఉన్న దేవాలయాలను కమిటీలకు అప్పగింత. ఈ ఆలయాల నిర్వహణ బాధ్యత అర్చకులదే. ఐదేళ్ల పాటు ఈ నిర్ణయం అమలులో ఉంటుంది. 

► పాడి రైతులకు సరైన ధర కల్పించాం. ఇవాళ పాల సేకరణ పెరిగింది. పాల ధర పెరిగింది. అమూల్‌ రావడం వల్ల పాడి రైతులకు మేలు జరిగింది. 

► ఉద్యోగులందరికీ ఏరియర్స్‌తో 2.73శాతం డీఏకు ఆమోదం తెలిపినట్టు స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top