స్థానిక సంస్థల ఎన్నికలు.. చంద్రబాబు ఇంటి వద్ద భారీ రిగ్గింగ్‌ | Massive Rigging Near Chandrababu Naidu Residence in Kuppam | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల ఎన్నికలు.. చంద్రబాబు ఇంటి వద్ద భారీ రిగ్గింగ్‌

Nov 5 2026 8:38 PM | Updated on Nov 5 2026 8:38 PM

Massive Rigging Near Chandrababu Naidu Residence in Kuppam

సాక్షి,చిత్తూరు: చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం కడపల్లి గ్రామంలో టీడీపీ శ్రేణులు భారీగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఈ రిగ్గింగ్‌ సైతం చంద్రబాబు ఇంటి వద్ద జరగడం గమనార్హం.

కడపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రాల్లో బరితెగించిన టీడీపీ గూండాలు, పోలింగ్ బూత్‌లలోకి బలవంతంగా చొరబడి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లపై దాడి చేసి బయటకు పంపేశారు. అంతేకాకుండా, ఏకంగా వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిని సైతం ఓటు వేయకుండా అడ్డుకుని బలవంతంగా వెనక్కి పంపడం చర్చాంశనీయంగా మారింది. 

ఇదే ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీకి చెందిన ఓటర్లతో కడపల్లిలో అక్రమంగా ఓట్లు వేసిన ఘటనలు సైతం వెలుగులోకి వచ్చాయి. ఓటు వేసేందుకు వచ్చిన సాధారణ ఓటర్లను సైతం టీడీపీ గూండాలు బెదిరించి బయటకు గెంటేశారు.

రోడ్డుపై బైఠాయించి ఓటర్లు, కార్యకర్తల ఆందోళన
టీడీపీ మూకల ఈ అరాచకాలు, రిగ్గింగ్‌ను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, బాధిత ఓటర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కడపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అధికార పార్టీ నాయకులు పోలీసుల సమక్షంలోనే అక్రమాలకు పాల్పడుతున్నారని వారు మండిపడ్డారు. చంద్రబాబు సొంతూళ్లోనే ఇలాంటి ఘటనలు జరగడం శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. ఈ ఘటనతో కుప్పం ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement