శేషాచలం కొండల్లో చెలరేగిన మంటలు

Massive Fire Accident In Seshachalam Forest - Sakshi

తిరుమల: శేషాచలం కొండల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. శేషాతీర్థం అటవీ ప్రాంతాల్లో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. శేష తీర్థం సమీపంలోని డబ్బారెకుల కొనలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి మంటలు దట్టంగా వ్యాపించాయి. అటవీ ప్రాంతంలో భారీగా మంటలు ఎగసిపడుతుండడంతో అడవంతా అగ్నికి ఆహుతయ్యే ప్రమాదం పొంచి ఉంది. అయితే మంటలు చెలరేగిన ప్రాంతానికి అగ్నిమాపక సిబ్బంది, అటవీ అధికారులు చేరడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఆ ప్రాంతానికి కనీసం మనుషులు చేరుకోడానికి ఒక రోజు సమయం పడుతుంది. దీంతో ఆ మంటలు తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అయితే ఆ మంటలు ఎవరైనా ఎర్రచందనం స్మగ్లర్లు పెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేసవికాలంలో శేషచల కొండల్లో అగ్ని ప్రమాదాలు సంభవించడం సాధారణం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top