సార్.. నా భార్య కనిపించడం లేదు.. | Married Woman Missing in Chittoor | Sakshi
Sakshi News home page

సార్.. నా భార్య కనిపించడం లేదు.. చిన్నాపై అనుమానం

Mar 23 2022 8:11 PM | Updated on Mar 23 2022 9:11 PM

Married Woman Missing in Chittoor - Sakshi

నరేంద్ర భార్య అమ్ము

చిత్తూరు (ఏర్పేడు) : తన భార్య కనిపించడం లేదంటూ ఫోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. మండలంలోని రాజులపాలెం వ్యవసాయ పొలాల్లో ఓ వివాహిత  పై భర్త ఫిర్యాదు చేసినట్లు బాదితుడి ఫిర్యాదు మేరకు మంగళవారం ఏర్పేడు సీఐ శ్రిహరి తెలిపిన వివరాలు.. వలమనేరు మండలవ జండామఠ గ్రామానికి చెందిన నరేంద్ర బాతులు మేపుతూ కుంటుంబాన్ని ఫోషిస్తున్నాడు.

బాతులను భార్య అమ్ము(24) తో కలసి  మండలంలోని రాజులపాలెంకు ఈ నెల 11వ తేదిన వచ్చాడు. గ్రామ పొలాల్లో టెంట్ వేసుకుని బాతులు మేపి అక్కడే ఇద్దరూ నిద్రించారు. అయితే మరుసటి రోజు ఉదయం 5 గంటలకు ప్రాంతంలో నరేంద్రకు మెలకువ వచ్చి చూడగా భార్య కనిపించలేదు. ఆమె కోసం స్వగ్రామంలో పాటు పలుచోట్లా గాలించినా ఆచూకి లభించకపోవడంతో మంగళ వారం  ఫోలీసులకు  ఫిర్యాదు చేశాడు. తమ గ్రామనికి చెందిన ఆటో డ్రెవర్ చిన్నా తన భార్యను కిడ్నాప్ చెసినట్లు అనుమానం ఉందని  ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆమె అచూకి తెలిస్తే 9440900729 ఫోన్ నంబరుకు సమాచారం ఇవ్వాలని సీఐ తెలిపారు

Advertisement
 
Advertisement
Advertisement