రెచ్చిపోయిన మద్యం మాఫియా: ఎస్‌ఐపై దాడి | Liquor Mafia Attack Excise SI In Hindupur | Sakshi
Sakshi News home page

హిందూపురంలో రెచ్చిపోయిన మద్యం మాఫియా

Aug 29 2020 9:43 AM | Updated on Aug 29 2020 11:44 AM

Liquor Mafia Attack Excise SI In Hindupur - Sakshi

సాక్షి, అనంతపురం : హిందూపురంలో మద్యం మాఫియా రెచ్చిపోయింది. మద్యం అక్రమ విక్రయాలను అడ్డుకున్న ఎక్సైజ్‌ ఎస్సై సరోజతో సహా ముగ్గురు కానిస్టేబుళ్లపై మద్యం వ్యాపారులు దాడి చేశారు. కర్నాటక మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎస్సై సరోజ ముగ్గురు కానిస్టేబుళ్లతో బోయపేటకు వెళ్లారు. పోలీసులను చూసిన మద్యం మాఫియా వారిపై ఒక్కసారిగా దాడికి దిగారు. ఎస్సై సరోజ ఫోన్‌ను లాక్కుని దాడికి దిగారు. ఈ దాడిలో ఎస్సైతో సహా ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసులో బోయపేటకు చెందిన రామాంజి, లక్ష్మినారాయణలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement