తిరుమలలో చిరుత కలకలం.. సర్వదర్శన టోకెన్ల క్యూలైన్‌ వద్ద అలర్ట్‌! | Leopard Movement At Tirumala Ghat Road | Sakshi
Sakshi News home page

తిరుమలలో చిరుత కలకలం.. సర్వదర్శన టోకెన్ల క్యూలైన్‌ వద్ద అలర్ట్‌!

Jan 30 2025 8:15 PM | Updated on Jan 31 2025 7:25 AM

Leopard Movement At Tirumala Ghat Road

సాక్షి, తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మరోసారి చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది. చిరుత సంచారం భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తిరుమల శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు భక్తులు గుర్తించారు. దీంతో, వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం అందించారు.

వివరాల ప్రకారం.. తిరుమలలో చిరుత సంచారం భక్తులను మరోసారి భయాందోళనకు గురిచేస్తోంది. తిరుమల శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు భక్తులు గుర్తించారు. ఈ క్రమంలో వెంటనే టీటీడీ, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే, ప్రస్తుతం సర్వదర్శన టోకెన్ల క్యూలైన్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలోనే చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో, భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement