Latest Morning Top 10 News And Highlights On 6th July 2022 - Sakshi
Sakshi News home page

Morning 10 AM Top News: మార్నింగ్‌ టాప్‌ 10 తెలుగు న్యూస్‌

Published Wed, Jul 6 2022 9:47 AM

Latest Telugu News Morning Top 10 News Today Highlight 6th July 2022 - Sakshi

1. CM YS JAGAN: కడప జిల్లా పర్యటనకు సీఎం జగన్‌.. రెండు రోజుల పాటు..
జిల్లాలో ఈనెల 7,8 తేదీలలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం షెడ్యూల్‌ ఖరారు చేసింది. 7వ తేదీ ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 9.20 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు.
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. సామాన్యులకు షాక్‌, భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర!
పెరిగిపోతున్న నిత్యవసర వస్తువుల ధరలతో బెంబేలెత్తుతున్న వినియోగదారునికి మరో షాక్‌. ఇళ్లలో వినియోగించే 14.2కేజీల సిలిండర్‌పై రూ.50 ధరని పెంచుతూ చమురు కంపెనీలు ప్రకటించాయి.దీంతో రూ.1055 నుంచి రూ.1105కు చేరిన సిలిండర్‌ ధరకు చేరింది. ఇక పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.  
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. YSRCP Plenary 2022: తిరుగులేని శక్తి
రాజకీయంగా వైరిపక్షాలైన కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై వైఎస్‌ జగన్‌ను, వైఎస్సార్‌సీపీని అణగదొక్కడానికి చేయని కుట్ర లేదు.. పన్నని కుతంత్రం లేదు. దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ ఎదుర్కోనన్ని సమస్యలు, సవాళ్లు, దాడులు ఎదుర్కొంది. అయినప్పటికీ వైఎస్‌ జగన్‌ ఒకే మాట.. ఒకే బాటగా ముందుకు సాగారు. ఏ దశలోనూ ప్రజల పక్షాన పోరాటాన్ని ఆపలేదు.
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. స్వమిత్వ పథకం: తెలంగాణలో పైలట్‌ ప్రాజెక్టుకు సెలక్టైన గ్రామాలివే!
 పల్లె ఇల్లు ఇక నుంచి ఆన్‌లైన్‌లోకి వెళ్లు.. ప్రతి ఇంటి లెక్క పక్కాగా సేకరిస్తారు. అందుకే కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వశాఖ ఇంటింటి సర్వే చేపట్టింది. ‘స్వమిత్వ’పథకం పేరుతో ఇళ్ల సర్వే మొదలుపెట్టింది. గ్రామకంఠం మొత్తాన్ని డ్రోన్‌ కెమెరాల ద్వారా బంధించి, వాటి ఆధారంగా ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తారు. 
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. అమ్మో.. కోనోకార్పస్‌!.. దడ పుట్టిస్తున్న మడజాతి మొక్కలు
కోనోకార్పస్‌.. ఈ మొక్క పేరు వింటేనే పర్యావరణ ప్రేమికులు, వృక్షశాస్త్రవేత్తలు హడలిపోతున్నారు. రాష్ట్రంలో పలు మున్సిపాలిటీల్లో సుందరీకరణ కోసం దీన్ని విరివిగా పెంచుతున్నారు. అయితే.. వీటితో పర్యావరణానికి పలువిధాలుగా విఘాతం కలుగుతోందని, ముఖ్యంగా పట్టణప్రాంత ప్రజల్లో శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయని, మున్సిపాలిటీలకు రూ.లక్షల్లో నష్టం కలుగుజేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. కరోనా, మంకీ ఫీవర్‌కి తోడుగా మరో జబ్బు
కరోనా, మంకీ ఫీవర్‌కి తోడుగా మరో జబ్బు జిల్లాలో తలెత్తింది. శివమొగ్గ నగరంతో పాటు జిల్లాలో ఇప్పటివరకు సుమారు 81 ఎలుక జ్వరం (ఆర్‌బీఎఫ్‌) కేసులు నమోదు కావడం జరిగిందని శివమొగ్గ జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మే నెల చివరి నాటికి సుమారు 30 కేసులు నమోదు కాగా, అప్పటి నుంచి నేటి వరకు అవి మొత్తం 81 కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు.
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7.Johnson Government: సంక్షోభంలో జాన్సన్‌ సర్కారు
బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్న బోరిస్‌ జాన్సన్‌ సర్కారుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్‌ మంత్రులు మంగళవారం రాజీనామా చేశారు.
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8.టీమిండియా ఓటమిపై కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్పందన
గత కొన్ని ఫలితాలు మాకు తీవ్ర నిరాశ కలిగించాయి. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో, ఇక్కడా మాకు మంచి అవకాశాలు లభించాయి. కానీ వాటిని ఉపయోగించుకోలేకపోయాం. బౌలింగ్‌లో ఒకే తరహా  తీవ్రత, ప్రదర్శన, ఫిట్‌నెస్‌ మ్యాచ్‌ ఆసాంతం కొనసాగించలేకపోవడం దానికి కారణమని భావిస్తున్నా. ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో విఫలమయ్యాం.
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. టాలీవుడ్‌ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ ఎడిటర్‌ కన్నుమూత
సినీ ఎడిటర్‌ గౌతమ్‌రాజు (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో భాదపడుతున్నారు. నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే ఒక్కసారిగా అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో 1:30 నిమిషాలకు ఆయన మరణించారు. 
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. తల్లి నగలు తాకట్టు పెట్టి గెర్బెరా పూలను సాగు చేశారు.. లక్షలు అర్జిస్తున్నారు
కోశాక నీటి తడిలో ఉంచితే 15 రోజుల పాటు వాడవు గెర్బెరా పూలు. జార్ఖండ్‌లో ఈ పూలు కావాలంటే బెంగళూరు నుంచి తెప్పించుకోవాలి. ఇప్పుడు జెమ్‌షడ్‌పూర్‌కు చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్లు ప్రియాంక, ప్రీతిలను అడిగితే చాలు వెంటనే లోడ్‌ పంపిస్తారు. లాకౌట్‌ కాలంలో తండ్రికి పనిపోవడంతో ఖాళీగా ఉన్న పొలంలో అలంకరణ పూలైన గెర్బెరాను సాగు చేశారు వీరు.
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement
 
Advertisement