CM YS JAGAN: కడప జిల్లా పర్యటనకు సీఎం జగన్‌.. రెండు రోజుల పాటు..

CM Jagan will Visit YSR Kadapa District for Two Days - Sakshi

7 న పులివెందుల, వేంపల్లెలో పలుకార్యక్రమాలలో పాల్గొననున్న సీఎం  

8న తండ్రి దివంగత వైఎస్సార్‌కు కుటుంబ సభ్యులతో కలసి ఘన నివాళి 

సాక్షి, పులివెందుల/కడప: జిల్లాలో ఈనెల 7,8 తేదీలలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం షెడ్యూల్‌ ఖరారు చేసింది. 7వ తేదీ ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 9.20 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ 9.30కి బయలుదేరి 10.20 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 10.30కి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి 10.55కు పులివెందులలోని బాకరాపురం హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 10.55కు హెలీప్యాడ్‌ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11 గంటలకు పులివెందులలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహానికి చేరుకుంటారు. 

11.05  నుంచి మధ్యాహ్నం ఒంటిగంట  వరకూ ప్రజలు, ప్రజా ప్రతినిధులతో మాట్లాడి వారి వినతులు స్వీకరిస్తారు. 1.05కు ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్‌ నుంచి బయలుదేరి 1.15కు పులివెందులలోని ఏపీకార్ల్‌ చేరుకుంటారు. అక్కడ 1.30వరకూ ఉండి  క్షేత్రస్థాయి పర్యటన చేస్తారు. 1.30కి ఏపీకార్ల్‌ నుంచి బయలుదేరి 1.35కు ఏపీకార్ల్‌ ప్రధాన భవనానికి చేరుకుని న్యూటెక్‌ బయోసైన్సెస్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రధాన భవనంలో ఐజీ కార్ల్‌ మీటింగ్‌లో పాల్గొంటారు.  

2.35కు ఏపీకార్ల్‌ నుంచి బయలుదేరి 2.45కు బాకరాపురం హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 2.50కు అక్కడి నుంచి బయలుదేరి 3.05కు వేంపల్లి హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ  3.20వరకూ స్థానిక నేతలతో మాట్లాడుతారు. 3.20కి రోడ్డు మార్గాన బయలుదేరి 3.30కి డా. వైఎస్సార్‌ స్మారక పార్కుకు చేరుకొని పార్కును ప్రారంభిస్తారు. 3.50కి అక్కడి నుంచి బయలుదేరి 4 గంటలకు వేంపల్లి జిల్లా పరిషత్‌ బాలికల హైస్కూల్‌కు చేరుకుని భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడ 4.50 వరకూ విద్యార్థినీ, విద్యార్థులతో ముచ్చటిస్తారు. 4.50కి వేంపల్లి జెడ్పీ స్కూల్‌ నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు వేంపల్లి హెలీప్యాడ్‌ చేరుకుంటారు. 5.05కు హెలికాప్టర్‌లో బయలుదేరి 5.15కు ఇడుపులపాయ చేరుకుంటారు. 5.20కి హెలీప్యాడ్‌ నుంచి బయలుదేరి 5.25కు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌కు చేరుకుని రాత్రి బస చేస్తారు.  

చదవండి: (YSRCP Plenary 2022: పార్టీ పండుగ ‘ప్లీనరీ’)

8వ తేదీ ఉదయం 8 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌ నుంచి బయలుదేరి 8.05కు వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకొని దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి నివాళులు అర్పించి ప్రార్థనల్లో పాల్గొంటారు. 8.45కు వైఎస్సార్‌ ఘాట్‌ నుంచి బయలుదేరి 8.50కు ఇడుపులపాయలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 8.55కు హెలీకాప్టర్‌లో బయలుదేరి 9.10కి కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. 9.20 గంటలకు కడప విమానాశ్రయం నుంచి బయలుదేరి 10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి 10.20కి రోడ్డు మార్గాన బయలుదేరి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగనున్న వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో పాల్గొంటారు.  

 

వేంపల్లెలో సీఎం పర్యటనా ప్రాంతాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌

8 సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు 
వేంపల్లె:  ఈనెల 7, 8వ తేదీలలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ వి.విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌లు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జెడ్పీటీసీ ఎం.రవికుమార్‌రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి పర్యటనా ప్రాంతాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు.
 
కడప – పులివెందుల బైపాస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ స్థలాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న అధికారులకు భద్రతపై సలహాలు, సూచనలు చేశారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్‌ మెమోరియల్‌ పార్కు, రూ.15 కోట్ల వ్యయంతో నిర్మించిన జిల్లా పరిషత్‌ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల నూతన భవనాలు, కంప్యూటర్‌ ల్యాబ్స్, ఆర్‌ఓ మినరల్‌ వాటర్‌ ప్లాంటును పరిశీలించారు. వీటిని 7వ తేదీన  సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు.   

కార్యక్రమంలో జేసీ సాయికాంత్‌వర్మ, అడిషనల్‌ ఎస్పీ మహేష్‌కుమార్, ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ సుధాకర్‌రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు, డీఎస్పీ శ్రీనివాసులు, ఎంపీపీ ఎన్‌.లక్ష్మీగాయత్రి, మండల ఉపాధ్యక్షుడు బాబా షరీఫ్, డ్వామా పీడీ యదుభూషణ్‌రెడ్డి, ఈఈ సిద్ధారెడ్డి, ఏపీఈడబ్లు్యఐడీసీ డీఈ సుబ్రమణ్యకుమార్, విద్యుత్‌ శాఖ డీఈ శ్రీకాంత్, స్పెషలాఫీసర్‌ మధుసూదన్‌రెడ్డి, తహసీల్దార్‌ ఎన్‌.చంద్రశేఖరరెడ్డి, ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.  

అధికారులకు సూచనలు 
పులివెందుల: సీఎం వైఎస్‌ జగన్‌  పులివెందులలో పర్యటించనున్న దృష్ట్యా అందుకు సంబంధించిన ఏర్పాట్లను  కలెక్టర్‌ విజయరామరాజు,  ఎస్పీ అన్బురాజన్‌లు మంగళవారం పరిశీలించారు. పులివెందులలోని భాకరాపురంలోని హెలీప్యాడ్, ఆర్‌అండ్‌బీ అతిథి గృహం, ఏపీ కార్ల్‌ను వారు పరిశీలించారు. అధికారులకు పర్యటనా ఏర్పాట్లపై తీసుకోవాల్సిన చర్యలు, భద్రతకు సంబంధించి పలు సూచనలు, సలహాలను అందించారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో తీసుకోవాల్సిన చర్యలపై, ఏపీ కార్ల్‌లో రైతులతో సమావేశం ఉన్నందున అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న విషయాలపై సుదీర్ఘంగా అధికారులతో చర్చించారు. 

పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు, ఆర్‌అండ్‌బీ ఈఈ సిద్ధారెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్‌ మాధవకృష్ణారెడ్డి, కమిషనర్‌ నరసింహారెడ్డి, సీఐలు రాజు, బాలమద్దిలేటి, ఎస్‌ఐలు గోపినాథరెడ్డి, చిరంజీవి పాల్గొన్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top