కరోనా, మంకీ ఫీవర్‌కి తోడుగా మరో జబ్బు

Eighty One Cases of Rat Fever reported in Shivamogga - Sakshi

శివమొగ్గ: కరోనా, మంకీ ఫీవర్‌కి తోడుగా మరో జబ్బు జిల్లాలో తలెత్తింది. శివమొగ్గ నగరంతో పాటు జిల్లాలో ఇప్పటివరకు సుమారు 81 ఎలుక జ్వరం (ఆర్‌బీఎఫ్‌) కేసులు నమోదు కావడం జరిగిందని శివమొగ్గ జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మే నెల చివరి నాటికి సుమారు 30 కేసులు నమోదు కాగా, అప్పటి నుంచి నేటి వరకు అవి మొత్తం 81 కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు. జూన్‌ నెలలోనే సుమారు 51 మంది ఈ జ్వరానికి గురయ్యారని చెప్పారు.   

ఏమిటీ ఎలుక జ్వరం  
రెండు రకాల బ్యాక్టీరియా వల్ల ఎలుక జ్వరం సో­కు­తుంది. ఈ బ్యాక్టీరియా సోకిన ఎలుకలు, పందికొక్కు­లు వంటి జీవులు మనిషిని కరిచినా, లేదా అవి కొ­రి­కి­న పండ్లు, కూరగాయలు, ఆహార పదార్థాలను తి­న్నా ఈ జబ్బు వ్యాపించే ప్రమాదముంది. జ్వరం, త­ల­నొ­ప్పి, వాంతులు, ఒంటి నొప్పులు, కొందరిలో కీళ్ల వా­పు, దద్దుర్లు ఈ జ్వరం లక్షణాలు. చలి–జ్వరం వి­డి­చి విడిచి వస్తుంటుంది. వైద్యులను కలిసి యాంటి బ­యా­టిక్స్‌ చికిత్స తీసుకుంటే తగ్గిపోతుంది. ఈ జ్వర పీ­డితుల నుంచి దూరంగా ఉండడం మంచిది. పరిస­రా­ల్లో ఎలుకలు, పందికొక్కులు లేకుండా చూసుకోవాలి.

చదవండి: (అమ్మో.. కోనోకార్పస్‌!.. దడ పుట్టిస్తున్న మడజాతి మొక్కలు) 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top