టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ ఎడిటర్ కన్నుమూత

సాక్షి, హైదరాబాద్: సినీ ఎడిటర్ గౌతమ్‌రాజు (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో భాదపడుతున్నారు. నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఒక్కసారిగా అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో 1:30 నిమిషాలకు ఆయన మరణించారు.
800కిపైగా సినిమాలకు గౌతమ్‌రాజు ఎడిటర్‌గా పనిచేశారు. ఖైదీ నెంబర్ 150, గబ్బర్‌సింగ్, కిక్, రేసుగుర్రం, గోపాల గోపాల, అదుర్స్, బలుపు, ఊసరవెల్లి, బద్రీనాథ్ సినిమాలకు గౌతమ్‌రాజు ఎడిటర్‌గా పనిచేశారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడలోనూ అనేక సినిమాలకు ఆయన పనిచేశారు. గౌతమ్‌రాజు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.