సీపీఐ నారాయణకు ‘ఎల్లా’ దంపతుల పరామర్శ

Krishna Ella met CPI Leader Narayana - Sakshi

నగరి: సతీ వియోగంతో బాధపడుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను భారత్‌ బయోటెక్‌ అధినేత డాక్టర్‌.కృష్ణ ఎల్లా, ఆయన సతీమణి డాక్టర్‌ సుచిత్ర ఎల్లా ఆదివారం పరామర్శించారు. వీరు చిత్తూరు జిల్లా నగరి మండలంలోని అయనంబాకం గ్రామంలో నారాయణ స్వగృహానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.

డాక్టర్‌ సుచిత్ర మాట్లాడుతూ.. నారాయణ సతీమణి వసుమతిదేవి మనమధ్య లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, ఇలాంటి విషాదం నుంచి నారాయణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు చక్రవర్తి నాయుడు కూడా నారాయణను పరామర్శించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top