Kodali Nani Interesting Comments On NTR Family - Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ కుటుంబంపై నాకు విశ్వాసం ఉంది.. ఆయన నాకు సీటు ఇప్పించారు: కొడాలి నాని

Oct 13 2022 12:54 PM | Updated on Oct 13 2022 1:19 PM

Kodali Nani Interesting Comments On NTR Family - Sakshi

 ఎన్టీఆర్‌ కుటుంబంపై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

సాక్షి, కృష్ణా: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్‌ కల్యాణ్‌పై మాజీ మంత్రి కొడాలి నాని సీరియస్‌ అయ్యారు. చంద్రబాబు, పవన్‌ నాటకాలను ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తున్నారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు అమరావతి పేరిట యాత్రలు చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

కాగా, కొడాలి నాని గుడివాడలో మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబుకు ఉత్తరాంధ్ర ప్రజలు గుణపాఠం చెప్పాలి. 2024 ఎన్నికల్లో చంద్రబాబుకు రాజకీయ సమాధి కట్టాలి. టీడీపీ, చంద్రబాబును ఘోరంగా ఓడించాలి. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబుకు రాజకీయ జీవితాన్ని ఎన్టీఆర్‌ ఇచ్చారు. ఎన్టీఆర్‌ను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. బాబును నమ్మడమే ఎన్టీఆర్‌ చేసిన తప్పు. చంద్రబాబుకు ఏమాత్రం విశ్వాసం లేదు. 

తోడు కోసం ఎన్టీఆర్‌.. లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్‌ వివాహం చేసుకున్నారు. లక్ష్మీపార్వతికి ఎన్టీఆర్‌ ఎలాంటి పదవులు ఇవ్వలేదు. రాజకీయాల్లోని నన్ను హరికృష్ణ తీసుకువచ్చారు. ఎన్టీఆర్‌ కుటుంబంపై నాకు విశ్వాసం ఉంది. అమరావతి రైతుల ముసుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌ను తిట్టిస్తున్నారు. నాకు జూనియర్‌ ఎన్టీఆర్‌ సీటు ఇప్పించారు. నేను ఎన్టీఆర్‌, హరికృష్ణకు రుణపడి ఉంటాను. హైదరాబాద్‌లో కొండలు తవ్వి చంద్రబాబు, పవన్‌ ఇళ్లు కట్టుకోలేదా?. విశాఖలో కుంభకోణం జరిగింని ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోంది’ అంటూ మండిపడ్డారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement