
సాక్షి, సిటీబ్యూరో/సంబేపల్లె: మిసెస్ ఇండియా సీజన్ –5 విజేతగా కవ్వం విజయలక్ష్మి నిలిచారు. ఢిల్లీలో జరిగిన గ్రాండ్‌ఫినాలే ఫలితాలను నిర్వాహకులు బుధవారం ప్రకటించారు. హైదరాబాద్ ప్రతినిధిగా పోటీల్లో పాల్గొన్న విజయలక్ష్మి అన్ని రౌండ్లలోనూ విజేతగా నిలిచారు. వీఆర్‌పీ ప్రొడక్షన్ డైరెక్టర్ డా. రీతు ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ గ్రామీణ వాతావరణంలో పుట్టి, వ్యవసాయ రంగం నుంచి పలు సంస్థలను నిర్వహించి, జాతీయ స్థాయిలో విజేతగా నిలవడం సంతోషాన్నిచి్చందన్నారు. దీని వెనుక కుటుంబ సభ్యుల సంపూర్ణ మద్దతు ఉందని పేర్కొన్నారు.
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి..
అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలం మినుమరెడ్డిగారిపల్లెలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన రామాంజులు రెడ్డి, సరస్వతమ్మల రెండో కుమార్తె కవ్వ విజయలక్ష్మి. సంబేపల్లె ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఆమె ఇంటర్ సండుపల్లె మండలం జీకే రాచపల్లెలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అభ్యసించింది. తర్వాత ఆమె వివాహం చేసుకొని హైదరాబాద్‌లో స్థిరపడింది. తాను సాధించిన విజయాన్ని రాష్ట్రంలో మహిళలకు అంకితం ఇస్తున్నట్టు విజయలక్ష్మి తెలిపింది.