
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అన్ని వ్యవసాయ అంశాల్లో వ్యవసాయ మండళ్లను భాగస్వామ్యం చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అన్ని వ్యవసాయ అంశాల్లో వ్యవసాయ మండళ్లను భాగస్వామ్యం చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శుక్రవారం ఆయన వ్యవసాయ సలహా మండళ్ల ఛైర్మన్ల అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వ్యవసాయ మండళ్లకు రైతునే ఛైర్మన్‌గా నియమించాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు.
వ్యవసాయ సేవలను రైతులకు మరింత చేరువగా, మెరుగ్గా అందాలనే మంచి ఉద్దేశంతో సీఎం.. వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ, ఉద్యాన, సహకార, పట్టు సాగు, చేపలు రొయ్యల పెంపకం, సహకార తదితర అన్ని అంశాల్లో ఈ మండళ్లు తమ సూచనలను అందిస్తాయని వెల్లడించారు. సాగు చేసే ప్రతి పంట ఈ క్రాప్‌లో రిజిస్టర్ చేయించాలని మంత్రి కన్నబాబు అన్నారు.