బద్వేలు ఉపఎన్నికపై వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం | Kakani Govardhan Reddy Comments On Badvel Bypoll | Sakshi
Sakshi News home page

కులం, మతం పేరుతో బీజేపీ ప్రజలను మభ్యపెడుతోంది: కాకాణి

Oct 9 2021 10:48 AM | Updated on Oct 9 2021 1:33 PM

Kakani Govardhan Reddy Comments On Badvel Bypoll - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: బద్వేలు ఉపఎన్నికపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్‌ భాషా, ఎంపీ అవినాష్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దాసరి సుధ పాల్గొన్నారు. ఉపఎన్నికల ప్రచారం, ప్రణాళికలపై బూతుస్థాయి నేతలతో సమావేశంలో చర్చించనున్నారు.

రాష్ట్రం మొత్తం బద్వేలు వైపు చూస్తోంది
బద్వేలు ఎన్నికల్లో భారీ విజయం ఖాయమని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. శనివారం వైఎస్సార్‌ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కులం, మతం పేరుతో బీజేపీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం బద్వేలు వైపు చూస్తోంది. నియోజకవర్గ పరిధిలోని అందరూ కలిసికట్టుగా కృషిచేసి భారీ మెజారిటీ అందించాలి. ఇప్పుడు వచ్చే మెజార్టీ రాబోయే ఎన్నికల్లో వచ్చే సీట్లను పెంచే స్థాయిలో ఉండాలి అని కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement