అంధుల పాఠశాలలో ప్రవేశాలు.. సదరం సర్టిఫికెట్‌ తప్పనిసరి

Kadapa Government School for Blind: Applications Invited - Sakshi

జూలై 31 వరకు దరఖాస్తులకు గడువు

1 నుంచి 10వ తరగతి వరకు ఉచితంగా విద్య

బాలబాలికలకు ప్రత్యేక హాస్టల్‌  

కడప ఎడ్యుకేషన్‌: కడప శంకరాపురంలోని అంధుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2022–23 విద్యా సంవత్సరంలో 1 నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో చేరే బాల, బాలికలకు ఉచితంగా చదువు చెప్పడమే కాకుండా.. ప్రత్యేక హాస్టల్‌ వసతి కూడా కల్పిస్తారు. ఈ పాఠశాలలో ఏపీతో పాటు తెలంగాణకు చెందిన వారు కూడా చేరవచ్చు. ఆసక్తి ఉన్నవారు జూలై 31లోగా దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.శంకరయ్య సూచించారు. 

దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా సదరం మెడికల్‌ సర్టిఫికెట్‌ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలతో పాటు మూడు ఫోటోలను జతచేసి దరఖాస్తు చేయాలని సూచించారు. పది ఫలితాల్లో ఈ ఏడాది వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. ప్రవేశాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 9291306870, 9494077761 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top