Central Appoints Justice Dhiraj Singh Thakur As CJ Of AP High Court - Sakshi
Sakshi News home page

ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ 

Jul 25 2023 5:39 AM | Updated on Jul 25 2023 4:37 PM

Judge Dhiraj Singh as CJ of AP High Court - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ను నియమించాలన్న సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రాం మేఘ్వాల్‌ సోమవారం రాత్రి ట్వీట్‌ చేశారు. జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని జూలై 5న సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసిన విషయం విదితమే. జస్టిస్‌ ఠాకూర్‌ ప్రస్తుతం బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement