AP: జాబ్‌ మేళాకు జేజేలు 

Job Mela In AP: Leading companies To select candidates - Sakshi

  సీఎం సూచనతో వైఎస్‌ఆర్‌సీపీ చొరవ

 అభ్యర్థుల చెంతకు ప్రముఖ కంపెనీలు

రెండు నెలల్లోనే 34 వేలకు పైగా ఉద్యోగాలు

రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనాలు

సాక్షి నెట్‌వర్క్‌: మేథో సంపత్తిలోనూ, కష్టపడి పనిచేయటంలోనూ తెలుగు యువతకు ఎవరూ సాటిరారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల్లో పది లక్షల మందికి పైగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. మనదేశంలో 50 లక్షల మంది ఐటీ ఉద్యోగులుంటే హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీలన్నింటిలో 50 శాతం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉద్యోగులే ఉన్నారు. అలాగే బెంగళూరులో 25 శాతం, చెన్నైలో 15 శాతం ఉద్యోగులు ఈ రాష్ట్రానికి చెందిన వారే. 

అభివృద్ధిని హైదరాబాద్‌కే పరిమితం చేసిన గత పాలకుల నిర్ణయాల ఫలితం.. విభజనాంధ్రప్రదేశ్‌లో యువతకు శాపంగా మారింది. ఒకప్పుడు లోకల్‌ స్టేటస్‌ను అనుభవించిన మన విద్యార్థులు ఇప్పుడు అక్కడ నాన్‌ లోకల్‌గా మారిపోయారు. అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి తన పార్టీ నాయకులు, కార్యకర్తలకు మాత్రమే అవకాశాలు కల్పించింది. 2019లో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ శకానికి శ్రీకారం చుట్టింది. చదువు ద్వారానే ఆర్థికాభివృద్ధి సాధ్యమని నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల జీవన ప్రమాణాలను పెంచే దిశగా ప్రణాళికలు అమలు చేస్తున్నారు.

‘కులం చూడం.. మతం చూడం.. పార్టీలు చూడం.. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికీ అవకాశాలు కల్పిస్తాం..’ అంటూ అన్ని రంగాల్లో అందరికీ అవకాశాలు కల్పిస్తున్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థను సృష్టించి ఒకేసారి లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా విద్యార్థుల చదువుకు తోడ్పాటు అందిస్తూనే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనలతో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాలు నిరుద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. పరిశ్రమలు లేకపోయినా, శ్రమించే యువత ఉండటం మనకు కలిసి వచ్చిన అదృష్టం. ఏప్రిల్‌ 16, 17 తేదీల్లో తిరుపతిలో,  23, 24 తేదీల్లో విశాఖపట్నంలో.. ఈ నెల 7, 8 తేదీల్లో గుంటూరులోని ఏఎన్‌యూలో నిర్వహించిన జాబ్‌ మేళాల్లో 34,173 మంది నిరుద్యోగులకు వివిధ కంపెనీలు ఆఫర్‌ లెటర్లు అందించాయి. మరో రెండువేల మంది ఫైనల్‌ ఇంటర్వ్యూలకు సెలెక్ట్‌ అయ్యారు. 

తిరుపతిలో శ్రీకారం 
రాయలసీమ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఏప్రిల్‌ 16, 17 తేదీల్లో తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో  మెగా జాబ్‌ మేళా నిర్వహించారు. పార్టీ వెబ్‌సైట్‌లో సుమారు 47 వేల మందికి పైగా నిరుద్యోగులు పేర్లను నమోదు చేసుకున్నారు. 143 జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. టెక్నికల్, నాన్‌ టెక్నికల్‌ కేటగిరీల్లో ఉద్యోగాలకు కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. 

టెన్త్‌ నుంచి ఎంటెక్‌ వరకూ.. 
రెండు రోజుల పాటు నిర్వహించిన ఎంపికల్లో మొత్తం 8,256 మంది నిరుద్యోగులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పించారు. పది, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్‌ డిప్లొమా విద్యార్హత కలిగిన 4,139 మంది..  డిగ్రీ, పీజీ విద్యార్హత కలిగిన 2,041 మంది.. బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్హత కలిగిన 1,358 మంది యువతీ యువకులు ఉద్యోగాలు సాధించారు. మరో 718 మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అభ్యర్థులకు కనిష్ట వేతనం రూ.13 వేలు కాగా గరిష్టంగా రూ.77 వేలు వేతనం లభించనుంది. 

సాగర తీరాన... 
విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఏప్రిల్‌ 23, 24 తేదీల్లో జాబ్‌ మేళా నిర్వహించారు. 208 కంపెనీలు జాబ్‌మేళాలో పాల్గొన్నాయి. తొలిరోజు 13,663 మంది, రెండో రోజు 8,554 మంది చొప్పున మొత్తంమీద 22,217 మంది యువతీ యువకులు ఉద్యోగాలు సాధించారు. మొదటి రోజు జాబ్‌మేళాలో రూ.12, రూ.10 లక్షల వార్షిక వేతనాలతో ఇద్దరు, రెండోరోజు రూ.12.5 లక్షల వేతనంతో ఒకరు,  రూ.12 లక్షల వేతనంతో ఇద్దరు ఉద్యోగాలు సాధించటం విశేషం. మేళాలో పాల్గొన్న ఒమిక్స్‌ కంపెనీ ఈ మేరకు అత్యధిక వేతనం ఆఫర్‌ చేసి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లను నియమించుకుంది. టెన్త్‌ విద్యార్హతలతోనే రూ.10 వేల వేతనంతో ఫ్లిప్‌కార్ట్‌ నియామకాలు చేసుకొంది. 

ఏఎన్‌యూలో... 
గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈనెల 7,8 తేదీల్లో నిర్వహించిన జాబ్‌మేళాకు 14,500 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అందులో 3,700 మందికి ఆఫర్‌ లెటర్స్‌ ఇచ్చారు. మరో రెండు వేల మంది ఫైనల్‌ సెలెక్షన్స్‌కు ఎంపికయ్యారు. నెలకు రూ.14 వేల నుంచి ఏడాదికి రూ.11 లక్షల వరకు ప్యాకేజీలు లభించాయి. విభిన్న ప్రతిభావంతులకు ఉద్యోగాలు ఇప్పించేందుకు యూత్‌ ఫర్‌ జాబ్స్‌ ఫౌండేషన్‌ సంస్థ తీసుకున్న చొరవ ప్రశంసనీయం. వెబ్‌ ప్రాసెస్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, దక్కారో టీ హబ్, డీమార్ట్, మ్యాక్స్, ఫ్లిప్‌కార్ట్‌లతో కలిసి 42 మంది దివ్యాంగులకు ఇంటర్వ్యూలు నిర్వహించి అందరికీ ఆఫర్‌ లెటర్స్‌ అందించారు.  త్వరలో కడపలో.. కడపలో త్వరలో జాబ్‌ మేళా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తేదీలు ఖరారు కావాల్సి ఉంది.

సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకే...  
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన రెడ్డి ఆదేశాల మేరకే ఈ జాబ్‌ మేళాలు నిర్వహిస్తున్నాం. చదువుకుని అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు అండగా  ఉండాలన్న సీఎం ఆశయ సాధనలో భాగంగానే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జాబ్‌ మేళాలు నిర్వహిస్తున్నాం. సుమారుగా 15,000 ఉద్యోగాలు వరకూ కల్పించాలని తలపెట్టిన కార్యక్రమం అనుకున్న అంచనాలను మించి తిరుపతి, విశాఖపట్నం, గుంటూరులలో కలిపి 35,000 పైచిలుకు ఉద్యోగాలు కల్పించాం. ఇది ఆరంభం మాత్రమే. ప్రతిఏటా జాబ్‌ మేళా ఒక నిరంతర ప్రక్రియగా నిర్వహించనున్నాం. నిరుద్యోగ సమస్య తీరేవరకూ మరిన్ని జాబ్‌ మేళాలు నిర్వహిస్తూ వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువతకు అండగా ఉంటుంది.           
– వి.విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు, వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి 

దేశ చరిత్రలోనే అద్వితీయం 
వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన మూడు సంవత్సరాల్లోనే ప్రభుత్వంలో 6,03,756 పైచిలుకు ఉద్యోగాలు కల్పించారు. సీఎం ఆదేశాల మేరకు  ప్రయివేటు రంగంలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు వీలైనంత మేరకు ఉద్యోగ కల్పన చేయాలని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మెగా జాబ్‌ మేళాకు శ్రీకారం చుట్టింది. బహుశా భారతదేశ చరిత్రలోనే ఇలాంటి గొప్ప కార్యక్రమం ఇదే మొదటిసారి అనడంలో అతిశయోక్తి లేదు. నిరుద్యోగ యువత రిజిస్ట్రేషన్‌ కోసం ఏర్పాటు చేసిన  ఠీఠీఠీ. yటటఛిp్జౌbఝ్ఛ ్చ.ఛిౌఝకి చాలా మంచి రెస్పా¯Œన్స్‌ వచ్చింది. విద్యార్థులు ఖీజ్చిnజు ్గౌu ఇM  జీట  అంటూ జేజేలు పలుకుతుంటే ఈ కరోనా పాండమిక్‌లో కల్పించిన ఉద్యోగాలకు వారి ఆనందానికి అవధుల్లేవు.   
– గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top