రాకెట్‌ లాంచ్‌ని ప్రత్యక్షంగా చూడాలనుకునే వారికి ‘ఇస్రో’ బంపర్‌ ఆఫర్‌

ISRO Has Invited Citizens To Witness Its Next Rocket Launch - Sakshi

న్యూఢిల్లీ: అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా గగనతలంలోకి రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను పంపిస్తారు శాస్త్రవేత్తలు. నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్తాయి రాకె‍ట్లు. ఆ  దృశ్యాలను ఎవరైనా టీవీలో చూడాల్సిందే. అయితే.. ఆ అద్భుతాన్ని ప్రత్యక్షంగా శాస్త్రవేత్తలతో కలిసి వీక్షించే అవకాశాన్ని కల్పిస్తోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో). ఈ వారాంతంలో తన తదుపరి స్పేస్‌ మిషన్‌ను ప్రయోగించనుంది ఇస్రో. ఆ ప్రయోగాన్ని లాంచ్‌ వ్యూ గ్యాలరీ నుంచి వీక్షించేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానిస్తోంది. నేరుగా చూడాలనుకునేవారు ముందుగా రిజిస్టర్‌ చేసుకోండి మరి.

ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ1/ఈఓఎస్‌-02 మిషన్‌ను 2022, ఆగస్టు 7న ఉదయం 9.18 గంటలకు ప్రయోగించనుంది ఇస్రో. ఆంధ్రప్రదేశ్‌, శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పెస్‌ సెంటర్‌ నుంచి ఈ ప్రయోగం జరగనుందని ట్విట్టర్‌లో పేర్కొంది ఇస్రో. ప్రత్యక్షంగా వీక్షించాలనే ఆసక్తి ఉన్నవారు తమ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలంటూ ఓ లింక్‌ను షేర్‌ చేసింది. ఈ మిషన్‌ ద్వారా ఈఓఎస్‌-02 , ఆజాదిసాట్‌ అనే రెండు శాటిలైట్లను మోసకెళ్లనుంది రాకెట్‌.

ఇదీ చదవండి: Viral Video: సముద్రంలో తెల్లటి చుక్కల్లా....జెల్లీ ఫిష్‌ సముహం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top