-
రాకెట్ లాంచ్‌ని ప్రత్యక్షంగా చూడాలనుందా?..అయితే ఇది మీకోసమే!
న్యూఢిల్లీ: అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా గగనతలంలోకి రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను పంపిస్తారు శాస్త్రవేత్తలు. నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్తాయి రాకెట్లు. ఆ దృశ్యాలను ఎవరైనా టీవీలో చూడాల్సిందే. అయితే.. ఆ అద్భుతాన్ని ప్రత్యక్షంగా శాస్త్రవేత్తలతో కలిసి వీక్షించే అవకాశాన్ని కల్పిస్తోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో). ఈ వారాంతంలో తన తదుపరి స్పేస్ మిషన్‌ను ప్రయోగించనుంది ఇస్రో. ఆ ప్రయోగాన్ని లాంచ్ వ్యూ గ్యాలరీ నుంచి వీక్షించేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానిస్తోంది. నేరుగా చూడాలనుకునేవారు ముందుగా రిజిస్టర్ చేసుకోండి మరి. ఎస్ఎస్ఎల్వీ-డీ1/ఈఓఎస్-02 మిషన్‌ను 2022, ఆగస్టు 7న ఉదయం 9.18 గంటలకు ప్రయోగించనుంది ఇస్రో. ఆంధ్రప్రదేశ్, శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పెస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనుందని ట్విట్టర్లో పేర్కొంది ఇస్రో. ప్రత్యక్షంగా వీక్షించాలనే ఆసక్తి ఉన్నవారు తమ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలంటూ ఓ లింక్‌ను షేర్ చేసింది. ఈ మిషన్ ద్వారా ఈఓఎస్-02 , ఆజాదిసాట్ అనే రెండు శాటిలైట్లను మోసకెళ్లనుంది రాకెట్. The launch of the SSLV-D1/EOS-02 Mission is scheduled for Sunday, August 7, 2022, at 9:18 am (IST) from Satish Dhawan Space Centre (SDSC), Sriharikota. ISRO invites citizens to the Launch View Gallery at SDSC to witness the launch. Registration is open at https://t.co/J9jd8yDs4a pic.twitter.com/rq37VfSfXu — ISRO (@isro) August 1, 2022 ఇదీ చదవండి: Viral Video: సముద్రంలో తెల్లటి చుక్కల్లా....జెల్లీ ఫిష్ సముహం -
వన్‌ప్లస్ 5 లాంచింగ్: భలే ఆఫర్, ధర ఎంతంటే?
ముంబై: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ తన సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ 'వన్ ప్లస్ 5'ను జూన్ 22న విడుదల చేయనుంది. న్యూయార్క్‌లో జూన్ 20న లాంచ్ అవుతుండగా భారత్‌లో 22న విడుదల. హై-ఎండ్ స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరలో అందిస్తూ మార్కెట్లో దూసుకుపోతున్న వన్ ప్లస్, సరికొత్తగా వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. రెండు వేరియంట్లలో ఇది లభించనుంది. దీని ధర 6జీబీ, 64జీబీ స్టోరేజ్ (బేస్ వేరియంట్) ధర రూ. 37,999గాను, 8జీబీ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,999గా ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. వన్‌ప్లస్ ఫౌండర్, సీఈవో పీటే లా దీన్ని ఆవిష్కరించనున్నారు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికర ఆఫర్ ఉంది. జూన్ 22న ముంబైలో జరిగే లాంచింగ్ ఈవెంట్‌కు హాజరు కావాలనుకుంటే ఓ బంపర్ ఆఫర్ కూడా ఉంది. దీనికి జూన్ 12న వన్‌ప్లస్ అధికారిక సైట్ లో ఒక వెల్కం ప్యాక్‌ను కొనుగోలు చేయాలి. టీ షర్ట్ సహా కాంబో ఆఫర్ తో అందించే ఇన్వైట్ బాక్స్‌ను కస్టమర్లు రూ.999 లకు కొనుగోలు చేయాలి. ఇందులో దాదాపు పదివేల రూపాయల విలువ చేసే వస్తువులను ఉచితంగా అందిస్తోంది. 1. రూ.3990 విలువ చేసే బ్రాండ్-న్యూ స్పెషల్ బ్యాక్‌ప్యాక్ విలువ 2. యునిప్లోస్ సన్ గ్లాసెస్ , వీటి విలువ రూ. 6000 3. టీ -షర్టు ఈ బాక్స్‌ను వెంటనే కస్లమర్ల ఇంటికి వెంటనే రవాణా చేయబడుతుంది.దీన్ని స్వీకరించిన తర్వాత, కస్టమర్ల వన్ ప్లస్ ఖాతాకు రూ. 999 క్రెడిట్ అవుతుంది. ఈ కోడ్‌ను ప్లన్ ప్లస్ 5 కొనుగోలు సమయంలో వాడుకోవచ్చు. దీన్ని మూడు రోజుల్లోపు ఉపయోగించు కోవాలి. దీంతో పాటు మరొకరిని ఆహ్వానించేందుకు వీలుగా ఒక కోడ్ కూడా అందుతుంది. దీన్ని మన స్నేహితులకు షేర్ చేయవచ్చు. ఈకోడ్ ద్వారా డైరెక్ట్ గా ఫోన్ కొనుగోలు చేయవచ్చన్నమాట. మరోవైపు జూన్ 22వ తేదీన ఈ ఫోన్ భారత్‌లో విడుదల కానున్ను వన్ ప్లస్ 5 అదే రోజున ఈ ఫోన్ అమెజాన్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. 8 జీబీ ర్యామ్ వేరియెంట్ విక్రయించనుంది. రెండు కెమెరాలు ఖాయం అని తెలసినప్పటికీ ఎంపీ ఎంత అనేది స్పష్టం కాలేదు. ట్విట్టర్ ఉంచిన ఇమేజ్ ప్రకారం బ్లాక్ కలర్ లో వస్తున్న వన్ ప్లస్ 5 లో రెండు రియర్ కెమెరాలను అమర్చినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా చిన్న టీజర్‌ను కూడా వన్‌ప్లస్ ట్విట్టర్లో విడుదల చేసింది. వన్ ప్లస్ 5 ఫీచర్లు స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ 2.5డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే, 128 జీబీ 3300 ఎంఏహెచ్‌బ్యాటరీ Coming Soon. #OnePlus5 https://t.co/XWfMtBbOFg pic.twitter.com/HULFUiW6EB — OnePlus (@oneplus) June 9, 2017
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రచారంలో భారతమ్మ..!
బాబే భూబకాసురుడు
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. సీపీ శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌కు కేతిరెడ్డి సవాల్
రాజస్తాన్ రాయల్స్ జట్టుతో సైనా నెహ్వాల్.. ఫొటోలు వైరల్
ఆస్పత్రిలో హీరోయిన్.. మత్తు మందు.. బాధ తట్టుకోలేకపోతున్నా!
కవితకు బిగ్ షాక్...నో బెయిల్
మళ్లీ సీఎం జగనే.. బాపట్ల రేపల్లె సిద్ధం (ఫొటోలు)
టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు
ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్‌లు వీరే..
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- Parvathipuram: ఎన్ఆర్ఐకు ఎదురుగాలి
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement