Viral Video: సముద్రంలో తెల్లటి చుక్కల్లా....జెల్లీ ఫిష్‌ సముహం

Viral Video: Massive Jellyfish Swarm Appear Like Polka Dots In Israeli Sea - Sakshi

జెల్లీఫిష్‌లు గురించి అందరూ వినే ఉంటారు. వాస్తవానికి అవి మహా సముద్రాల్లో లోతైన ప్రాంతాల్లో సంచరించే ఒక రకమైన జీవి. ఈ అకశేరుకాలలో మెదుడు అనేది ఉండదు. వాటి శరీరంలో మొత్తం దాదాపు 95% నీరు ఉంటుంది. మనం మహా అయితే ఒకటో రెండో జెల్లీ ఫిష్‌లు సముద్రంలో అరుదుగా కనిపిస్తాయి. ఏకంగా పెద్ద సముహంలా జెల్లీఫిష్‌లను చూసి ఉండం. కానీ ఇజ్రాయెల్‌లోని నేషన్స్‌ పార్క్స్‌ అండ్‌ నేచర్‌ అథారిటీ ఒక అద్భుతమైన వీడియోని పోస్ట్‌ చేసింది. ఆ వీడియోలో ఒక​ పడవ చుట్టూ భారీ సముహంలా కొన్ని లక్షల జెల్లీఫిష్‌లు ఉంటాయి.

పైగా అవి చూసేందుకు సముద్రంలో తెల్లటి చుక్కల వలే అందంగా కనిపిస్తాయి. చూసేందుకు భలే అద్భుతంగా ఉంటుంది. ఐతే కాలుష్యం, వాతావరణ మార్పులే ఈ జెల్లిఫిష్‌లు అధిక సంఖ్యలో పెరిగిపోవడానికి కారణమని అంటున్నారు శాస్త్రవేత్లు. ఇవి వాస్తవానికి హిందూ మహాసముద్రలో ఉద్భవించాయి. ఐతే సూయజ్‌ కాలువా ద్వారా తూర్పు మధ్యధరా ప్రాంతానికి చేరుకుంటాయని విశ్వసిస్తారు. శీతలికరణం కోసం సమద్రపు నీటిని వినియోగిస్తాయి.

కానీ అధిక సంఖ్యలో ఉన్న ఈ జెల్లీఫిష్‌లు పవర్‌ స్టేషన్‌లో విద్యుత​ సరఫరాకి ప్రమాదకరంగా ఉన్నాయి. ఐతే ఈ జెల్లీ ఫిష్‌లు మానువులను కుడతాయని కొద్దిపాటి మోతాదులో విషం ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇవి కుట్టిన ఒక్కోసారి అంతపెద్ద ప్రమాదం సంభవించదు గానీ కాస్త నొప్పిగా ఉండటంతో అసౌకర్యానికి గురవుతాం. కొన్ని అరుదైన సందర్భాల్లో విపరీతమైన నొప్పి ఏర్పడి మరణానికి దారితీసే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.

(చదవండి: శివయ్య మీద పాట: సింగర్‌ ఫర్మానీపై ముస్లిం పెద్దల నారజ్‌.. హిందూ సంఘాల రియాక్షన్‌ ఇది!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top